Pakistan Cricket: టీ 20 వరల్డ్ కప్ ముందు పాక్ క్రికెట్‌కు భారీ షాక్.. రాజీనామా చేసిన మిస్బా ఉల్ హక్, వకార్ యూనిస్

మిస్బా ఉల్ హక్

టీ-20 వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ క్రికెట్‌ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. పాకిస్తాన్ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్(Misbah-ul-Haq), బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్(Waqar Younis) వారి పదవులకు రాజీనామా చేశారు.

  • Share this:
    టీ-20 వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ క్రికెట్‌ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. పాకిస్తాన్ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్(Misbah-ul-Haq), బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్(Waqar Younis) వారి పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. మిస్బా ఉల్, వకార్ యూనిస్ రాజీనామా చేశారని తెలిపింది. పాకిస్తాన్ మాజీ టెస్ట్ ఆటగాళ్లు సక్లైన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్(Abdul Razzaq) ప్రస్తుతానికి తాత్కాలిక కోచ్‌లుగా ఉంటారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. త్వరలో జరగబోయే.. న్యూజిలాండ్‌ సిరీస్‌కు కూడా వీరిద్దరు తాత్కాలిక కోచ్‌లుగా వ్యవహరించనున్నారని బోర్డు వెల్లడించింది.

    ఇక, టీ 20 వరల్డ్ కప్ కోసం పీసీబీ పాక్ జట్టను ప్రకటించిన.. రెండు గంటల్లోనే మిస్బా ఉల్ హక్, వకార్ యూనిస్ రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మిస్బా ఉల్ హక్, వకార్ యూనిస్‌లకు సెప్టెంబర్ 2019 లో పీసీబీ ఈ బాధ్యతను అప్పగించింది. పీసీబీతో వారి ఒప్పందం మరో ఏడాది పాటు మిగిలి ఉండగానే.. మిస్బా ఉల్ హక్, వకార్ యూనిస్‌ పదవులకు రాజీనామా చేశారు.

    అయితే ఇటీవలే మాజీ క్రికెటర్, కామెంటేటర్‌ రమీజ్‌ రజా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా నియమితులైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 13న ఆయన బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈలోపే మిస్బా ఉల్ హక్, వకార్ యూనిస్‌లు కోచ్ పదవులకు రాజీనామా చేయడం హాట్ టాఫిక్‌గా మారింది.

    T20 World Cup: టీ20 ప్రపంచకప్​కు జట్టును ప్రకటించిన పాకిస్తాన్​.. ఆ సీనియర్​ బ్యాట్స్​మన్​కు షాకిచ్చిన సెలెక్టర్లు

    ఇక, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) లేటెస్ట్గా టీ20 ప్రపంచకప్‌ 2021 (T-20 World Cup 2021) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది.

    టీ 20 వరల్డ్ కప్‌లో పాల్గొనే పాకిస్తాన్ జట్టుకు స్టార్​ బ్యాట్స్​మన్​ బాబర్​ అజామ్ (Babar Azam)​ నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు పీసీబీ సోమవారం జట్టును ప్రకటించింది. అయితే అనూహ్యంగా అనుభవజ్ఞుడైన మిడిలార్డర్​ బ్యాట్స్​మన్​ షోయబ్​ మలిక్ (Shoaib Malik)​కు జట్టులో చోటు దక్కలేదు. సీనియర్​ బ్యాట్స్​మన్​ అయిన షోయబ్​ గత సెప్టెంబర్​ నుంచి అంతర్జాతీయ మ్యాచ్​లు(International matches) ఆడకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, కెప్టెన్​ బాబర్​ షోయబ్​ మలిక్​ కోసం పట్టుబట్టినట్లు సమాచారం. అయితే సెలెక్టర్లు (Selectors) మాత్రం అతని సూచనను పరిగణనలోకి తీసుకోకుండా జట్టును ఎంపిక చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: