MILLIONS OF VIEWS ON SOCIAL MEDIA FOR A VIDEO OF INDIAN CRICKETER SHIKHAR DHAWAN HAVING FUN WITH HIS FATHER SNR
చెంప దెబ్బతిన్న టీమిండియా క్రికెటర్ శిఖర్‌ధావన్..వైరల్ అవుతున్న వీడియో
Photo Credit:Instagram
video viral: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్‌ధావన్ చెంప దెబ్బ తిన్నాడు. ఓ పెద్దాయనతో జోక్ చేసినందుకు ఆయన క్రికెటర్ చెంప చెళ్లుమనిపించాడు.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
టీమిండియా ఓపెనర్ శిఖర్‌ధావన్ ఒక కామెడీ వీడియోతో ఫ్యాన్స్‌ని ఇంప్రెస్ చేశాడు. ఎప్పుడూ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ (Instagram)లో యాక్టివ్‌గా ఉంటే ధావన్..తన ఇన్‌స్టా ఖాతాలో లేటెస్ట్గా షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందర్ని తెగ నవ్విస్తోంది. ఒక స్టార్ క్రికెటర్ అయి ఉండి ఓ పెద్దాయన చేతిలో చెంప దెబ్బతిన్న వీడియోని చూసిన వాళ్లంతా లక్షల్లో లైక్‌లు, వేలల్లో కామెంట్స్ షేర్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శిఖర్‌ధావన్ (Shikhar Dhawan)అప్పుడప్పుడు క్రికెటర్లతో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, ఫ్యామిలీతో జాలీగా గడుపుతున్న మూమెంట్స్‌ని షేర్ చేస్తూ అందరికి దగ్గరవుతూ ఉంటాడు. ఈసారి ఓ యాక్షన్, కామెడీ కలగలిపిన చిన్న వీడియో(Funny video)ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసాడు. ఇందులో శిఖర్‌ధావన్ తన తండ్రి(Shikhar dhawan father)తో కామెడీ చేసినందుకు ఆయన చెంప చెళ్లు మనిపించారు. అయితే ఇదంతా సరదా కోసం తీసిన వీడియోనే అయినప్పటికి ధావన్ తండ్రి మాత్రం చాలా సీరియస్‌గా కనిపించడంతో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫన్నీ వీడియోకి లక్షల్లో వ్యూస్ (Millions of views)వస్తున్నాయి.
ఫన్నీ వీడియోలో సీరియస్ డైలాగ్..
శిఖర్ ధావన్ షేర్ చేసిన వీడియో చూసి అందరూ నవ్వుకుంటున్నారు. తన గదిలోంచి బయటకు వస్తున్న శిఖర్‌ధావన్ తండ్రి ఏంటీ లోపల తిరుగుతున్నావు అని సీరియస్‌గా పంజాబీ భాషలో క్వశ్చన్ చేశాడు. మా దగ్గర వారెంట్ ఉందా...మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అంటూ సీరియస్‌గా బదులివ్వడంతో ధావన్‌ని ఆయన తండ్రి చెంపపైన ఒక దెబ్బ కొట్టి పో లోపలి పో అంటూ తిట్టారు. తండ్రి చెంపపై కొట్టడంతో ధావన్ తన చెంపై చేయి పెట్టుకొని ఆశ్చర్యంగా గదిలోకి వెళ్లిపోయాడు. చాలా ఫన్నీగా ఉన్న ఈ వీడియోని నాలుగు లక్షల మంది చూశారు. మూడు వేల మందికిపైగా కామెంట్స్ పోస్ట్ చేశారు.
క్రికెటర్ కమ్ యాక్టర్..
టీమిండియా స్టార్ క్రికెటర్ తన తండ్రితో తీసిన ఈ ఫన్నీ మూమెంట్‌పై భారత మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ కామెంట్ స్పందించాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను మెచ్చుకుంటూ బెస్ట్ అని కామెంట్స్ చేశారు. ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ స్మైలీ ఎమోజీ షేర్ చేశాడు. క్రికెటర్లే కాదు బాలీవుడ్ హీరోలు ఆయుష్మాన్ ఖురానా, హుమా ఖురేషి ఈ వీడియోపై డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యారు. సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు శిఖర్‌ధావన్. ఫస్ట్ వన్డేలో కూడా 79, మూడో వన్డే 61పరుగులు చేశాడు నాట్ బ్యాడ్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో అందర్ని నవ్విస్తున్నాడు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.