• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • MILKHA SINGH TRAINED AS SPRINTER IN SECUNDERABAD KNOW FLYING SIKH RECORDS JNK

Milkha Singh : మిల్కాసింగ్ పరుగు నేర్చింది సికింద్రాబాద్‌లోనే.. ఫ్లయింగ్ సిఖ్ రికార్డులు తెలుసా?

మిల్కాకు సికింద్రాబాద్‌తో ఉన్న అనుబంధం తెలుసా? (PC: ANI Twitter)

పరుగుల రాజు మిల్కాసింగ్ ఇక లేరు. కోవిడ్ కారణంతో శుక్రవారం రాత్రి ఆయన కన్నుమూశారు. అంతర్జాతీయ వేదికలపై ఇండియాకు ఎన్నో పతకాలు సాధించిపెట్టిన మిల్కా పరుగు నేర్చింది సికింద్రాబాద్‌లోనే అని మీకు తెలుసా? ఆయన ఎక్కడ సాధన చేసే వాడంటే..

  • Share this:
    అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ గోవింద్‌పూర్‌లో మిల్కాసింగ్ (Milkha Singh) జన్మించాడు. దేశానికి స్వాతంత్రం వచ్చి పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత విభజన సమయంలో కళ్ల ముందే తల్లిదండ్రులను నరికి వేసినా చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయాడు. ఢిల్లీ శరణార్దుల క్యాంపులో చిన్న చిన్న నేరాలకు పాల్పడ్డాడు. మూడు సార్లు ఆర్మీలో (Army) జాయిన్ కావడానికి విఫలయత్నాలు చేశాడు. జీవితంలో మొదట అంతా వైఫల్యాలు, కష్టాలతో గడిపిన మిల్కాసింగ్.. చివరకు ట్రాక్‌ మీదే జీవితాన్ని వెతుక్కున్నాడు. ట్రాక్‌పై పరుగెత్తడమే (Sprinter) తన జీవితమని భావించాడు. అలా పరుగులు మొదలు పెట్టిన మిల్కాసింగ్.. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఛాంపియన్‌గా (Champion) నిలిచాడు. మూడు సార్లు ఆర్మీలో చేరడానికి ప్రయత్నించి విఫలమైనా.. చివరకు నాలుగోసారి 1951లో ఆర్మీకి ఎంపికయ్యాడు. అక్కడ నుంచి అతడి జీవితంలో సికింద్రాబాద్ కీలకపాత్ర పోషించింది. మిల్కా ఒక అథ్లెట్‌గా మారడానికి కంటోన్మెంట్ ప్రాంతం చిరునామాగా మారి చరిత్రలో నిలిచిపోయింది. ఇక్కడ పరుగులు నేర్చుకొని అంతర్జాతీయ స్థాయిలోభారత కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు.

    1951లో ఆర్మీకి ఎంపికైన తర్వాత అతడికి సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్ సెంటర్ (ఈఎంఈ సెంటర్)లో అడ్మిషన్ లభించింది. సికింద్రాబాద్ ప్రాంతంలో ఆయన 9 ఏళ్ల పాటు నివసించారు. 1951 నుంచి 1960 వరకు మిల్కా సింగ్ సికింద్రాబాద్‌లోనే ఉన్నారు. ఇక్కడ ఉంటున్నప్పుడే అతడికి అథ్లెటిక్స్‌తో పరిచయం ఏర్పడింది. అంత క్రితమే ఇంటి నుంచి స్కూల్‌కు తిరిగి ఇంటికి 10 కిలోమీటర్ల పరుగు పెట్టిన అనుభవం మిల్కాసింగ్‌కు ఉన్నది. ఆర్మీలో చేరాక పరుగులు పెట్టడం కూడా ఒక ఆట అని తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి దానిపై మక్కువ పెంచుకున్నాడు. సికింద్రాబాద్ ప్రాంతంలోని అమ్ముగూడ ప్రాంతంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అక్కడ ఉన్న పహాడ్ చుట్టూ రాళ్లు నింపిన బ్యాగ్‌ మోసుకుంటూ మిల్కా రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు. అంతే కాకుండా బొల్లారం రైల్వే స్టేషన్‌లోని రైలు పట్టాలపై కూడా పరుగులు తీసేవారు. ఒక్కోసారి రైలుతో పాటు సమానంగా పరుగెత్తుతూ సాధన చేసేవారు. ఈ విషయాలన్నీ స్వయంగా మిల్కా చెప్పుకొచ్చారు. ఈఎంఈ సెంటర్‌లోని ఒక ప్రాంతానికి మిల్కాసింగ్ కాలనీ అని పేరుపెట్టారు. అంతే కాకుండా ఒక స్టేడియానికి కూడా ఆయన పేరు ఉన్నది.





    మిల్కా సింగ్ తన కెరీర్‌లో 80 పోటీల్లో పాల్గొనగా 77 సార్లు విజయం సాధించారు. ఒక 10 ఏళ్ల పాటు మిల్కా సింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌ను ఏలారు. ఒక కామన్వెల్త్ పతకంతో పాటు నాలుగు ఆసియన్ క్రీడల బంగారు పతకాలు గెలుచుకున్నారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో 1956లో సాధించిన రికార్డు మళ్లీ 2014 వరకు చెక్కు చెదరలేదు. అలాంటి గొప్ప క్రీడాకారుడు మరణించడంపై దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను విషాదంలో నింపింది.
    Published by:John Naveen Kora
    First published: