వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర...కప్ ఆ జట్టుదేనన్న మైఖెల్ వాగన్

ICC Cricket World Cup 2019 | వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలపై స్పందించిన మైఖెల్ వాగన్...భారత జట్టును ఓడించిన జట్టే వరల్డ్ కప్ గెలుస్తుందని వ్యాఖ్యానించాడు.

news18-telugu
Updated: June 28, 2019, 5:48 PM IST
వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర...కప్ ఆ జట్టుదేనన్న మైఖెల్ వాగన్
వరల్డ్ కప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత జట్టు
  • Share this:
వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తుండడం పట్ల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాగన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయం సాధించడం తెలిసిందే. ఈ విజయంతో వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా టీమిండియా గుర్తింపు సాధించింది. వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు భారత్ ఆడిన ఆరు మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా...మిగిలిన ఐదు మ్యాచ్‌లలోనూ టీమిండియా విజయం సాధించింది.

వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలపై స్పందించిన మైఖెల్ వాగన్...భారత జట్టును ఓడించిన జట్టే వరల్డ్ కప్ గెలుస్తుందని వ్యాఖ్యానించాడు. ఇదే అంశాన్ని గతంలూనే చెప్పానని, దీనికే కట్టుబడి ఉన్నట్లు వ్యాఖ్యానించాడు.

First published: June 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>