బడేజా పోస్ట్‌పై మైకెల్‌ వాన్‌ కామెంట్.. ఫ్యాన్స్ మరిచిపోని 22 గజాలు.

Ravindra Jadeja

తాజాగా తన గుర్రంతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. నా 22 ఎకరాలలో ఎంటర్‌టైనర్‌ ఇదే.. అలాగే నాకు మంచి స్నేహితుడు కూడా మ.. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్‌ ఉంది.

  • Share this:
    టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మైదానంలో కానీ బయట కానీ ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. తాజాగా తన గుర్రంతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. నా 22 ఎకరాలలో ఎంటర్‌టైనర్‌ ఇదే.. అలాగే నాకు మంచి స్నేహితుడు కూడా మ.. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్‌ ఉంది. ఈ పోస్ట్ నెటిజన్స్ అనుహ్య స్పందన లభిస్తోంది. అలాగే ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ వాన్‌ కూడా జడేజా పోస్ట్‌పై స్పందించాడు. ఆ ఫోటోకు లైక్‌ చేసి హార్ట్‌ ఎమోజీలను పంపాడు. ఈ పోస్ట్‌పై వాన్‌ స్పందించడంపై జడేజా 22 అనే పదం వాడడమే అంటున్నారు నెటిజన్స్. ఇంతకి ఆ 22 వెనుక అసలు కథేంటో ఓ సారి చూద్దామా...


    తాజాగా ఇంగ్లాండ్.. భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సీరిస్ ఇంగ్లాండ్ ఘోరంగా వైపల్యం చెందింది. ఈ సీరిస్ సమయంలో మైకెల్‌ వాన్‌ తన నోటికి పనికి చెప్పాడు. ముఖ్యంగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన చివరి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో వాన్ వివాద్సాపద వ్యాఖ్యలు చేశారు. నాలుగో టెస్టుకు 22 గజాల పిచ్‌ను ఎలా తయారుచేస్తు్న్నారో చూడండి అంటూ రైతు నాగలితో దున్నుతున్న ఫోటోను పోస్ట్ చేసి రెచ్చిపోయాడు. వాన్‌ చేసిన ఈ అతికి అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.
    Published by:Rekulapally Saichand
    First published: