హోమ్ /వార్తలు /క్రీడలు /

Michael Jordan last dance Jersey : బాస్కెట్ బాల్ లెజెండ్ మైకేల్ జోర్డాన్ జెర్సీకి ఊహించని ధర.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అన్ని కోట్లా?

Michael Jordan last dance Jersey : బాస్కెట్ బాల్ లెజెండ్ మైకేల్ జోర్డాన్ జెర్సీకి ఊహించని ధర.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అన్ని కోట్లా?

PC : TWITTER

PC : TWITTER

Michael Jordan last dance Jersey : విఖ్యాత బాస్కెట్ బాల్ (Basket Ball) ప్లేయర్.. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్( NBA) హీరో మైకేల్ జోర్డాన్ (Michael Jordan) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆటకు వీడ్కోలు పలికి 2 దశాబ్దాలు పూర్తి కావొస్తున్నా అతడు గేమ్ లో ఆడిన వస్తువుల ద్వారా ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Michael Jordan last dance Jersey : విఖ్యాత బాస్కెట్ బాల్ (Basket Ball) ప్లేయర్.. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్( NBA) హీరో మైకేల్ జోర్డాన్ (Michael Jordan) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆటకు వీడ్కోలు పలికి 2 దశాబ్దాలు పూర్తి కావొస్తున్నా అతడు గేమ్ లో ఆడిన వస్తువుల ద్వారా ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటున్నాడు. జోర్డాన్ ఉపయోగించిన షూస్, జెర్సీలకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. వీటిని సొంతం చేసుకోవడానికి అతడి అభిమానులు ఎగబడతారు కూడా. తాజాగా మైకైేల్ జోర్డాన్ కు సంబంధించిన ఒక జెర్సీ వేలంలో రికార్డు ధర పలికింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10.1 మిలియన్ అమెరికన్ డాలర్లకు ఒక అభిమాని జోర్డాన్ జెర్సీని సొంతం చేసుకున్నాడు. ఇది మన కరెన్సీలో దాదాపుగా రూ. 80 కోట్లు. ఈ జెర్సీని జోర్డాన్ 1998  NBA ఫైనల్స్‌ గేమ్ 1లో ధరించాడు.

ఈ జెర్సీని ఆక్షన్ హౌస్ అయిన సోథెబీస్ వేలం నిర్వహించింది. నంబర్ 23 జెర్సీని సొంతం చేసుకోవడం కోసం 20 వేర్వేరు బిడ్డింగ్ లు వచ్చినట్లు ఆ సంస్థ పేర్కొంది. తాము 5 మిలియన్ డాలర్ల వరకు రావొచ్చని భావించినట్లు కూడా సోథెబీస్ పేర్కొంది. అయితే తమ అంచనాలకు మించి వేలంలో డబ్బు వచ్చిందని ఆ సంస్థ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

1984లో NBAలొ అడుగుపెట్టిన జోర్డాన్.. 1998 వరకు చికాగో బుల్స్ తరఫున ఆడాడు. మధ్యలో ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ. ఆ తర్వాత దానిని వెనక్కి తీసుకుంటూ జోర్డాన్ తన ఆటను కొనసాగించాడు. ఇక తన జట్టు చికాగో బుల్స్ ను ఆరు సార్లు చాంపియన్ గా కూడా నిలిపిన ఘనత జోర్డాన్ ది. అంతేకాకుండా ఐదు సార్లు NBA ఫైనల్స్  మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచాడు. 1998 NBA సీజన్ కు సంబంధించిన నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని కూడా తీసింది. ‘ద లాస్ట్ డ్యాన్స్’గా దానిని తన ఓటీటీలో రిలీజ్ చేసింది. అందులో 1998 సీజన్ లో చికాగో బుల్స్ ఏ విధంగా చాంపియన్ గా నిలిచిందో.. జోర్డాన్ ఆట గురించి ఆసక్తికర విషయాలను పొందు పరిచింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: America, Basket Ball, Sports, Team India, USA

ఉత్తమ కథలు