హోమ్ /వార్తలు /క్రీడలు /

MI w vs DC W Final : ఫైనల్లో ఫైటింగ్ టోటల్ సెట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఎంతంటే?

MI w vs DC W Final : ఫైనల్లో ఫైటింగ్ టోటల్ సెట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఎంతంటే?

PC : WPL

PC : WPL

MI w vs DC W Final : ముంబై (Mubai) వేదికగా జరుగుతోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 (WPL 2023) ఫైనల్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) రెచ్చిపోయింది. సగం పనిని పూర్తి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

MI w vs DC W Final : ముంబై (Mubai) వేదికగా జరుగుతోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 (WPL 2023) ఫైనల్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) రెచ్చిపోయింది. సగం పనిని పూర్తి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఢిల్లీ తరఫున కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (29 బంతుల్లో 35; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆమె తప్ప మిగిలిన ప్లేయర్లు దారుణంగా విఫలం అయ్యారు. అజేయమైన ఆఖరి వికెట్ కు శిఖా పాండే (17 బంతుల్లో27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), రాధా యాదవ్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) 52 పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్, వోంగ్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. ఎమిలా కెర్ రెండు వికెట్లు తీసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభారంభం దక్కలేదు. సిక్స్, ఫోర్ కొట్టి దూకుడు మీద కనిపించిన షఫాలీ వర్మ (11) వివాదాస్పద రీతిలో అవుటైంది. వన్ డౌన్ లో వచ్చిన క్యాప్సీ (0) డకౌట్ గా వెనుదిరిగింది. రెండు ఫోర్లతో టచ్ లో కనిపించిన జెమీమా రోడ్రిగ్స్ (9) చేజేతులా వికెట్ ను చేజార్చుకుంది. ఈ మూడు వికెట్లు కూడా వోంగ్ కే దక్కడం విశేషం. ఈ మూడు కూడా ఫుల్ టాస్ బంతులకే వికెట్లు రావడం విశేషం. ఈ దశలో కెప్టెన్ మెగ్ ల్యానింగ్, మారిజానె క్యాప్ (18) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే కెర్ బౌలింగ్ లో క్యాప్ అవుటైంది. కాసేపటికే లేని పరుగు కోసం ప్రయత్నించి ల్యానింగ్ అవుటైంది. ఒక దశలో 74/3గా ఉన్న 5 పరుగుల వ్యవధిలో 6 వికెట్లను కోల్పోయింది. దాంతో 79 పరుగులకు 9 వికెట్లతో నిలిచింది.

ఆదుకున్న శిఖా, రాధా

ఈ దశలో ఢిల్లీ జట్టును రాధా యాదవ్, శిఖా పాండేలు ఆదుకున్నారు. కేవలం 24 బంతుల్లోనే 52 పరుగులు జోడించి ఢిల్లీ జట్టుకు పోరాడే స్కోరును అందించారు. బ్రబోర్న్ స్టేడియంలో 132 పరుగుల లక్ష్యం అంటే చాలా చిన్నదే. ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలవాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయాల్సి ఉంది. అయితే ముంబై జట్టులో నాట్ సీవర్, హేలీ మ్యాథ్యూస్, హర్మన్ ప్రీత్ కౌర్, ఎమిలా కెర్, తానియా భాటియా లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.

తుది జట్లు

ముంబై ఇండియన్స్

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మ్యాథ్యూస్, యస్తిక భాటియా, నాట్ సీవర్ బ్రంట్, అమెలియా కెర్, పూజా వస్త్రాకర్, వోంగ్, కౌర్, ఖాజీ, కలిత, సైకా

ఢిల్లీ క్యాపిటల్స్

మెగ్ ల్యానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మారిజానె క్యాప్, తానియా భాటియా, క్యాప్సీ, జెస్ జొనాసెన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శిఖా పాండే, మిను మని

First published:

Tags: Delhi Capitals, Mumbai, Mumbai Indians, WPL 2023

ఉత్తమ కథలు