హోమ్ /వార్తలు /క్రీడలు /

MI vs UP W Live Scores : యూపీని ఉతికారేసిన సీవర్.. ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ సెట్ చేసిన ముంబై

MI vs UP W Live Scores : యూపీని ఉతికారేసిన సీవర్.. ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ సెట్ చేసిన ముంబై

PC : MI/Twitter

PC : MI/Twitter

MI vs UP W Live Scores : ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అదరగొట్టింది. తొలిసారి జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 (WPL 2023)లో భాగంగా శుక్రవారం యూపీ వారియర్జ్ (UP Warriorz)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

MI vs UP W Live Scores : ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అదరగొట్టింది. తొలిసారి జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 (WPL 2023)లో భాగంగా శుక్రవారం యూపీ వారియర్జ్ (UP Warriorz)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ (39 బంతుల్లో 78 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) యూపీ బౌలర్లపై చెలరేగిపోయింది. ఆమెకు అమెలియా కెర్ (19 బంతుల్లో 29; 5 ఫోర్లు ) రూపంలో చక్కటి సహకారం అందింది. ఫలితంగా ముంబై భారీ స్కోరును అందుకుంది. యూపీ బౌలర్లలో నాట్ సీవర్ 2 వికెట్లు తీసింది. అంజలి శర్వాణి, చోప్రాలకు చెరో వికెట్ లభించింది.

టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ కెప్టెన్ అలీసా హీలీ ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా వచ్చిన యస్తిక భాటియా (21; 4 ఫోర్లు), హేలీ మ్యాథ్యూస్ (26; 2 ఫోర్లు, 1 సిక్స్) ముంబై జట్టుకు శుభారంభం చేశారు. దూకుడుగా ఆడే క్రమంలో యస్తిక భాటియా, హేలీ మ్యాథ్యూస్ పెవిలియన్ కు చేరారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (14) విఫలం అయ్యింది. దాంతో ఒక దశలో ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది.

బతికిపోయి.. దంచి కొట్టి

ఈ దశలో జట్టు బాధ్యతను నాట్ సీవర్ తీసుకుంది. 6 పరుగుల వద్ద తాను ఇచ్చిన క్యాచ్ ను ఎకెల్ స్టోన్ జారవిడిచింది. దాంతో బతికిపోయిన సీవర్ రెచ్చిపోయి ఆడింది. 190 స్ట్రయిక్ రేట్ తో వేగంగా పరుగులు సాధించింది. అమీలా కెర్ తో కలిసి నాలుగో వికెట్ కు విలువైన పరుగులు జోడించింది. ఈ క్రమంలో సీవర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. చివర్లో కెర్ర్ అవుటైనా.. పూజా వస్త్రాకర్ ఆఖరి ఓవర్లో 4, 6 బాదింది. ఇక ఆఖరి బంతిని సీవర్ భారీ సిక్సర్ బాదడంతో ముంబై ఇండియన్స్ స్కోరు 182 పరుగులకు చేరుకుంది. ఈ టోర్నీలో డీవై పాటిల్ వేదికగా జరిగిన ప్రతి మ్యాచ్ లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే నెగ్గింది. ఈ స్టేడియాన్ని ఛేజింగ్ గ్రౌండ్ గా పేర్కొంటారు. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది.

ముంబై ఇండియన్స్

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మ్యాథ్యూస్, యస్తిక భాటియా, నాట్ సీవర్ బ్రంట్, అమెలియా కెర్, పూజా వస్త్రాకర్, వోంగ్, కౌర్, ఖాజీ, కలిత, సైకా

యూపీ వారియర్జ్

అలీసా హీలీ (కెప్టెన్), శ్వేత శెరావత్, సిమ్రాన్, తాలియా మెక్ గ్రాత్,  గ్రేస్ హ్యారీస్, దీప్తి శర్మ, సోఫీ ఎకెల్ స్టోన్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, చోప్రా

First published:

Tags: Cricket, Mumbai, Mumbai Indians, Sports, WPL 2023

ఉత్తమ కథలు