యూఎస్ ఓపెన్: మెన్స్, ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ చేరేదెవరు??

మెన్స్ సింగిల్స్‌‌ ఫైనల్‌లో సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జొకోవిచ్‌తో స్పానిష్ బుల్ రఫాల్ నడాల్ టైటిల్ కోసం పోటీపడటం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఉమెన్స్ సింగిల్స్‌‌లో సెరెనా విలియమ్స్,మ్యాడిసన్ కీస్ మధ్య ఆల్ అమెరికన్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ చూడొచ్చని అభిమానులు హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగబోతున్నారు.

news18-telugu
Updated: September 7, 2018, 11:19 AM IST
యూఎస్ ఓపెన్: మెన్స్, ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ చేరేదెవరు??
నడాల్, జొకోవిచ్, సెరెనా విలియమ్స్, ఒసాకా (US open Tennis/ Twitter)
  • Share this:
ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ అమెరికన్ ఓపెన్ పోటీలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. మెన్స్,ఉమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్స్ మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఆరంభమవుతాయా అని టెన్నిస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెన్స్ సింగిల్స్‌‌లో సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జొకోవిచ్, స్పానిష్ బుల్ రఫాల్ నడాల్...ఉమెన్స్ సింగిల్స్‌‌లో టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్,అమెరికన్ సెన్సేసన్ మ్యాడిసన్ కీస్ హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.మెన్స్ సెమీస్ ఫైట్‌లో టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్,నడాల్‌లకు నిషికోరీ,డెల్ పోత్రో సవాల్ విసురుతున్నారు.ఉమెన్స్ సింగిల్స్‌‌ సెమీస్‌లో అనస్టీసియా సెవాత్సోవా‌ నుండి సెరెనా విలియమ్స్‌కు, ఒసాకా నుండి మ్యాడిసన్ కీస్‌కు పెద్ద సవాలే ఎదురుకానుంది.

మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్‌లో 19వ సీడ్‌గా బరిలోకి దిగిన లాత్వియన్ సెన్సేషన్ అనస్టీసియా సెవాత్సోవా‌ 17వ సీడ్ సెరెనా విలియమ్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది.క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో సెరెనా, చెక్ రిపబ్లిక్ స్టార్ కరోలినా ప్లిస్కోవాను చిత్తు చేయగా...సెవాత్సోవా డిఫెండింగ్ చాంపియన్ స్లొయాన్ స్టీఫెన్స్‌కు షాకిచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది.మరో మ్యాచ్‌లో తొలిసారిగా అమెరికన్ ఓపెన్ సెమీఫైనల్‌ చేరిన జపనీస్ రైజింగ్ స్టార్ నవోమీ ఒసాకా సెమీఫైనల్‌లో మ్యాడిసన్ కీస్‌తో పోటీకి సన్నద్ధమైంది.క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో లెసియా సురెంకోను ఒసాకా ఓడించగా..స్పానిష్ స్టార్ కార్లా సారెజ్ నవారోను మ్యాడిసన్ కీస్ ఇంటిదారి పట్టించింది.

ఉమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లు:

  • తొలి సెమీఫైనల్ - సెరెనా విలియమ్స్ వర్సెస్ అనస్టీసియా సెవాత్సోవా

  • రెండో సెమీఫైనల్ - నవోమీ ఒసాకా వర్సెస్ మ్యాడిసన్ కీస్

మెన్స్ సింగిల్స్ తొలి సెమీస్‌లో సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జొకోవిచ్‌కు నిషికోరీ సవాల్ విసురుతున్నాడు.మరో సెమీస్‌ పోరులో ఫైనల్ బెర్త్ కోసం అర్జెంటీనా స్టార్ జువాన్ మార్టిన్ డెల్ పోత్రోతో స్పానిష్ బుల్ నడాల్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లు:

  • తొలి సెమీఫైనల్ - నొవాక్ జొకోవిచ్ వర్సెస్ కై నిషికోరీ

  • రెండో సెమీఫైనల్ - రఫాల్ నడాల్ వర్సెస్ యువాన్ మార్టిన్  డెల్ పోత్రో


మెన్స్ సింగిల్స్‌‌ ఫైనల్‌లో సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జొకోవిచ్‌తో స్పానిష్ బుల్ రఫాల్ నడాల్ టైటిల్ కోసం పోటీపడటం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఉమెన్స్ సింగిల్స్‌‌లో సెరెనా విలియమ్స్,మ్యాడిసన్ కీస్ మధ్య ఆల్ అమెరికన్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ చూడొచ్చని అభిమానులు హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగబోతున్నారు.
First published: September 6, 2018, 3:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading