Home /News /sports /

MEGASTAR CHIRANJEEVI JAVELIN THROW VIDEO GONE VIRAL IN SOCIAL MEDIA TRENDING AS JAVELIN THROW MEDAL WINNER BEFORE NEERAJ CHOPRA JNK GH

Viral Video: నీరజ్ చోప్రా కంటే ముందే జావెలిన్ త్రోలో మెడల్.. వైరల్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి వీడియో

నీరజ్ చోప్రా కంటే ముందే జావెలిన్ త్రోలో మెడల్ సాధించిన వీరుడు.. వైరల్‌గా మారిన వీడియో (PC: Instagram/Neeraj)

నీరజ్ చోప్రా కంటే ముందే జావెలిన్ త్రోలో మెడల్ సాధించిన వీరుడు.. వైరల్‌గా మారిన వీడియో (PC: Instagram/Neeraj)

నీరజ్ చోప్రా కంటే ముందే ఈ ఆటలో మరొకరు సత్తా చాటారని వీడియోలు షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో ఉన్న వీరుడు మరెవరో కాదు.. మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఒక సినిమాలోని క్లిప్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

టోక్యో ఒలింపిక్స్ విజయవంతంగా ముగిశాయి. ఈసారి విశ్వక్రీడల్లో భారత్ తరఫున స్వర్ణ పతకం సాధించాడు నీరజ్ చోప్రా. దీంతో అప్పటి వరకు ప్రజలకు పెద్దగా తెలియని జావెలిన్ త్రో ఆట.. ఇప్పుడు భారతీయుల నోళ్లలో నానుతోంది. అయితే నీరజ్ చోప్రా కంటే ముందే ఈ ఆటలో మరొకరు సత్తా చాటారని వీడియోలు షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో ఉన్న వీరుడు మరెవరో కాదు.. మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఆ వివరాలేంటో తెలుసుకోండి...

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో లో స్వర్ణం సాధించి దేశం మొత్తం గర్వపడేలా చేశాడు నీరజ్ చోప్రా. ఆటలో విజయం తరువాత పతకాన్ని అందుకుంటూ.. జాతీయ గీతాన్ని ఆలపించిన క్షణాలను దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఈ పతకంతో చరిత్రలో తన పేరును లిఖించుకున్న నీరజ్ కంటే ముందే.. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి స్వర్ణం గెలిచారని ట్విట్టర్ యూజర్లు చెబుతున్నారు. ట్విట్టర్‌లో 'గబ్బర్' అనే పేజీ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఒక సినిమాలో చిరంజీవి జావెలిన్ నైపుణ్యాలను చూపిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

చిరు విసిరిన జావెలిన్ ఏకంగా జడ్జిలు కూర్చున్న టేబుల్‌పై పడినట్లు వీడీయోలో కనిపిస్తోంది. దీంతో ఆ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన మెగాస్టార్.. "జావెలిన్‌లో మొదటి బంగారు పతకం" గెల్చుకున్నాడని వీడియోకు క్యాప్షన్ చెప్పారు. ప్రస్తుత సందర్భానికి తగినట్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి వివిధ రకాల కామెంట్లతో నెటిజన్లు హల్‌చల్ చేస్తున్నారు.



చిరు సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొన్న తరువాతే.. ఈసారి ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించలేదని ఒక యూజర్ సెటైరికల్ కామెంట్ పెట్టాడు. లేదంటే నీరజ్ విసిరిన జావెలిన్‌ ప్రేక్షకులకు తాకేదేమో అన్నట్లు రాశాడు. చిరంజీవి పతకం గెల్చినందుకు ఇవ్వాల్సిన కోటి రూపాయలు నాకే ఇవ్వండని మరో యూజర్ కామెంట్ చేశాడు. మరికొందరు మాత్రం.. నీరజ్ చోప్రా వంటి అథ్లెట్లకు మెగా స్టార్ చిరంజీవి నిజంగా స్ఫూర్తిగా నిలిచారని కామెంట్లు రాస్తున్నారు. ఈ సీన్ చిరంజీవి నటించిన ఇద్దరు మిత్రులు సినిమాలోనిది అని చిరు ఫ్యాన్స్ చెబుతున్నారు.
Published by:John Naveen Kora
First published:

Tags: Chiranjeevi, Olympics, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు