• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • MEGASTAR CHIRANJEEVI BIRTHDAY WISHES TO CRICKETER SACHIN TENDULKAR TA

క్రికెట్ లెజెండ్‌ సచిన్ టెండూల్కర్‌కు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు..

క్రికెట్ లెజెండ్‌ సచిన్ టెండూల్కర్‌కు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు..

సచిన్‌కు చిరు బర్త్ డే విషెస్ (Twitter/Photo)

మెగాస్టార్ చిరంజీవి ఎపుడైతే.. సోషల్ మీడియాలో అడుగుపెట్టారో.. అప్పటి నుంచి తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పాటు ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఈ రోజు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు.

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవి ఎపుడైతే.. సోషల్ మీడియాలో అడుగుపెట్టారో.. అప్పటి నుంచి తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పాటు ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. అంతేకాదు తనకు తెలిసిన ఆప్తుల పుట్టినరోజులకు సంబంధించి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్, అకిరానందన్‌, అఖిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. రీసెంట్‌గా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బర్త్ డే విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. ఈ రోజు భారత క్రికెట్ అభిమానులతో క్రికెట్ దేవుడిగా కొలవబడుతున్న సచిన్ టెండూల్కర్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసారు. అంతేకాదు అప్పట్లో క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో ఉన్న పాత ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అప్పట్లో చిరంజీవి, సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్‌కు సంబంధించిన దాంట్లో భాగస్వాములుగా కూడా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి లాక్‌డౌన్  కారణంగా పని లేకుండా పోయిన సినిమా వాళ్లకు సంబంధించి కరోనా క్రైసిస్ ఛారిటీ సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు