హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : ఈ పిల్లగాడు మాములోడు కాదు.. గ్రౌండ్ లో అమ్మను పరుగులు పెట్టించాడు..

Viral Video : ఈ పిల్లగాడు మాములోడు కాదు.. గ్రౌండ్ లో అమ్మను పరుగులు పెట్టించాడు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : ఇక, స్టేడియంలో ఆటలు ఆడేటప్పుడు వాళ్ల ఆటను చూడటానికి ఎంతో మంది ఫ్యాన్స్ తరలి రావడం కామన్. ఆటగాళ్లను ప్రోత్సాహిస్తూ విజిల్స్, చప్పట్లు కొడుతుంటారు. అదే చప్పట్లు, విజిల్స్ ఓ బుడ్డోడు దక్కించుకున్నాడు.

  సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఈ రోజుల్లో నెటిజన్లకు ఏదైనా నచ్చితే.. దాన్ని ఇట్టే వైరల్ చేసేస్తున్నారు. ఇక, స్టేడియంలో ఆటలు ఆడేటప్పుడు వాళ్ల ఆటను చూడటానికి ఎంతో మంది ఫ్యాన్స్ తరలి రావడం కామన్. ఆటగాళ్లను ప్రోత్సాహిస్తూ విజిల్స్, చప్పట్లు కొడుతుంటారు. అదే చప్పట్లు, విజిల్స్ ఓ బుడ్డోడు దక్కించుకున్నాడు.ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఓ బుడ్డోడు చేసిన పని ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. సిన్‌సిన్నాటి, ఓర్లాండో మధ్య ఫుట్ బాట్ మ్యాచ్ జరుగుతోంది. అందరూ సీరియస్ గా కన్నార్పకుండా మ్యాచ్ చూస్తున్నారు. ఇంతలో ఓబుడ్డోడు నెమ్మదిగా తల్లి ఒడినుంచి దిగిపోయి గ్రౌండ్ లోకి పాక్కుుంటూ వచ్చేశాడు. సీరియస్ గా మ్యాచ్ చూస్తున్న తల్లి పరధ్యానంగా ఉండగా ఆ పిల్లాడు ఒడిలోంచి జారి గ్రౌండ్ లోకి వచ్చేశాడు.కాసేపటికి తేరుకున్న ఆమె ఫెన్సింగ్‌ కింద నుంచి పాకుతూ గ్రౌండ్‌ వైపు పోతున్న సంగతి గుర్తించింది.వెంటనే రియాక్ట్‌ అయ్యి ఒక దూకున బారికేడ్‌ దూకి కొడుకు వెంటే గ్రౌండ్‌లోకి దౌడు తీసింది.

  అప్పటికే ఆ పిల్లాడు గ్రౌండ్ లోకి వచ్చేశాడు. పరుగులు పెట్టుకుంటూ వెళ్లిన ఆ వెంటనే కొడుకును ఒడిసి పట్టుకుంది. అక్కడే ఉండే సిబ్బంది సహకారం లేకుండానే పిల్లాడిని పట్టుకుని గ్రౌండ్‌ నుంచి బయటకు పరుగుపెట్టుకుంటూ వచ్చేసింది. ఇదంతా చూస్తున్న ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా గోల చేశారు.

  కట్‌ చేస్తే.. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అయ్యింది. కేవలం సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనను మేజర్‌ లీగ్‌ సాకర్‌ ట్విటర్‌ పేజ్‌ ఆ సరదా వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ బుడ్డోడు పేరు జేడెక్‌ కార్పెంటర్‌, ఆ తల్లి పేరు మోర్గాన్‌ టక్కర్‌. ఓహియోలో ఉంటారు. ఇక, వైరల్ వీడియోతో పాటు.. ఫోటో కూడా నెటిజన్లకు బాగా కనెక్ట్ అయింది. ఈ వీడియోను చూసి.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Foot ball, Sports, Viral Videos

  ఉత్తమ కథలు