కోహ్లీ మైనపు బొమ్మ ఓపెనింగ్ రేపే!

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2019, 2:21 PM IST
కోహ్లీ మైనపు బొమ్మ ఓపెనింగ్ రేపే!
Virat Kohli and his wax statue at Madame Tussauds
  • News18
  • Last Updated: June 6, 2019, 2:21 PM IST
  • Share this:
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా...అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం రేపే ఆవిష్కరణ జరగబోతోంది. ఢిల్లీలోని మేడమ్ టూసడ్స్ మ్యూజియంలో ఠీవీగా తన రూపానికి ప్రతీరూపమైన మైనపు విగ్రహంతో రేపు ఫోటోలకు ఫోజులు ఇవ్వబోతున్నాడు కోహ్లీ. తాజాగా సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని స్వయంగా అభిమానులతో పంచుకున్నాడీ రికార్డుల రారాజు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, పాపులారిటీ, క్రేజ్ దక్కించుకున్న సెలబ్రిటీలకు మాత్రమే మేడమ్ టూసడ్స్ మ్యూజియంలో చోటు లభిస్తుంది. ఇవన్నీ చాలా ఏళ్ల కిందటే సొంతం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. సొగసైన ఆటతో పాటు స్టైలిష్ లుక్కుతో కూడా యువతలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు విరాట్. బాలీవుడ్ భామ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విరాట్... సచిన్ తర్వాత ఆ స్థాయికి చేరే భావి క్రికెటర్ అని క్రికెట్ పండితుల చేత కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు అరుదైన ఘనత కూడా విరాట్ సొంతం కాబోతోంది. గత మార్చిలోనే మేడమ్ మ్యూజియం ప్రతినిధులు వచ్చి కోహ్లీ కొలతలను తీసుకెళ్లారు. రెండు నెలలకి విగ్రహం తయారీ పూర్తయ్యింది. దీంతో రేపు అనగా జూన్ 6న తన మైనపు బొమ్మను ఆవిష్కరించబోతున్నరని సంతోషంగా తెలిపాడు విరాట్ కోహ్లీ. ‘రండి... స్టాచ్యూ  ఆడుకుందాం...’ అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు.

[embed]https://www.instagram.com/p/Bjop8NeA-yN/?taken-by=virat.kohli[/embed]

అతి తక్కువ సమయంలో 8 లక్షలకు పైగా నెటిజనులు  ఈ వీడియోను తిలకించారు.  ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్, భారతదేశానికి తొలిసారి ప్రపంచకప్ అందించిన మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ విగ్రహాలు ఇప్పటికే ఈ మ్యూజియంలో కొలువుతీరాయి. వీరి తర్వాత మేడమ్ మ్యూజియంలో చోటు లభించిన క్రికెటర్ కోహ్లీయే. ఆస్టేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్ గ్రాత్, లెజండరీ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో విగ్రహాలు కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. అయితే వీరంతా రిటైర్ అయిపోయిన తర్వాత మైనపు బొమ్మలుగా మారితే, కోహ్లీ మాత్రం ఆడుతున్నప్పుడే మ్యూజియంలో చోటు సంపాదించుకున్నాడు.
Published by: Ramu Chinthakindhi
First published: June 5, 2018, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading