Home /News /sports /

MEET SAM HARRISON WHO SMACKS 8 SIXES IN AN OVER AT AUSTRALIA CLUB CRICKET SCORE CARD GOES VIRAL IN SOCIAL MEDIA SRD

Cricket News : క్రిస్ గేల్, యువరాజ్ లను మించిపోయావుగా..! ఒకే ఓవర్ లో 8 సిక్సర్లు ఏంటీ సామీ..!

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Cricket News : అప్పుడప్పుడూ క్రికెట్‌ (Cricket)లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి.

    అప్పుడప్పుడూ క్రికెట్‌ (Cricket)లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు..  బ్యాటర్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. కానీ, మనం ఇక్కడ చెప్పుకునేది అలాంటి ఇలాంటి విన్యాసం కాదు. సాధారంణంగా మనం క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టడమే పెద్ద ఘనతగా భావిస్తుంటాం. ఇప్పటి వరకు యువ రాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హెర్షెల్ గిబ్స్, జస్కరణ్ మల్‌హోత్రాలు అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనతను అందుకోగా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రవిశాస్త్రి, గార్‌ఫీల్డ్ సోబెర్స్, రాస్ విట్లే, హజ్రతుల్లా జజై, లియో కార్టర్, తిసారా పెరారా ఈ అరుదైన ఫీట్‌ సాధించారు. అయితే ఈ అందరి రికార్డులను వెనక్కినెట్టుతూ ఆస్ట్రేలియా యువ బ్యాటర్ సామ్ హారిసన్ ఏకంగా ఒకే ఓవర్‌లో 8 సిక్స్‌లు బాదాడు. బౌలర్ వేసిన రెండు నోబాల్స్‌ను సైతం సిక్స్‌గా మలిచిన అతను క్రికెట్ చరిత్రలో ఓ కొత్త రికార్డును నెలకొల్పాడు.

    పెర్త్ వేదికగా నార్త్ సబర్బన్ కమ్యూనిటీ క్రికెట్ అసోసియేషన్ సమక్షంలో జరిగిన గ్రేడ్ క్రికెట్‌లో సామ్ హారిసన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోర్రెంటో డంక్రైగ్ సీనియర్ క్లబ్, కింగ్‌స్లే వుడ్‌వాలే సీనియర్ క్లబ్ మధ్య మ్యాచ్ జరగ్గా.. సోర్రెంటోకు ప్రాతినిథ్యం వహించిన సామ్ హారిసన్ పరుగుల విధ్వంసం సృష్టించాడు.ప్రత్యర్థి బౌలర్ నాథన్ బెన్నెట్ వేసిన 39వ ఓవర్‌లో సామ్ హారిసన్ ఏకంగా 8 బంతుల్లో 8 సిక్సర్‌లు బాదాడు. ఈ ఓవర్‌లో నాథన్ బెన్నెట్ రెండు నో బాల్స్ వేయగా వాటిని కూడా సామ్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో, ఈ ఓవర్‌లో మొత్తం 50 పరుగులు వచ్చాయి.


    ఫలితంగా నాథన్ బెన్నెట్.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అయితే దీన్ని కన్నా చెత్త రికార్డు క్రికెట్‌లో ఉండటం గమనార్హం. న్యూజిలాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బెర్ట్ వెన్స్ అనే ఓ బౌలర్ ఏకంగా 77 పరుగులు సమర్పించుకున్నాడు. హయ్యెస్ట్ లెవల్ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఇక ఐపీఎల్‌లో క్రిస్ గేల్, రవీంద్ర జడేజాలు ఓకే ఓవర్‌లో 37 పరుగులు పిండుకున్నారు. ప్రశాంత్ పరమేశ్వరన్ బౌలింగ్‌లో గేల్.. ఈ ఏడాది హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఈ ఘనతను అందుకున్నారు.

    స్కోర్ కార్డు


    ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్‌ కార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఈ క్లబ్ మ్యాచ్‌లో సామ్ ఏకంగా 11 సిక్స్‌లు 6 ఫోర్లతో (102 నాటౌట్) అజేయ శతకం సాధించాడు. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన సోరెంటో డంక్రైగ్ క్లబ్ 40 ఓవర్లలో 276 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కింగ్‌స్లే వుడ్‌వాలే క్లబ్ నీర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది.దీంతో డంక్రైగ్ క్లబ్ 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక, సామ్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Australia, Chris gayle, Cricket, Yuvraj Singh

    తదుపరి వార్తలు