హోమ్ /వార్తలు /క్రీడలు /

Nico Ali Walsh : అప్పుడు తాత.. ఇప్పుడు మనవడు.. రింగ్ లో ప్రత్యర్ధుల్ని చెడుగుడు ఆడేశారు..

Nico Ali Walsh : అప్పుడు తాత.. ఇప్పుడు మనవడు.. రింగ్ లో ప్రత్యర్ధుల్ని చెడుగుడు ఆడేశారు..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Nico Ali Walsh : చిన్నప్పుడు నికో వాల్ష్ కు బాక్సింగ్ అంటే ఇష్టం ఉండేది కాదు. అయితే, 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు బాక్సింగ్ నే సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాక్సింగ్ తన కెరీర్ గా మార్చుకున్నాడు. ఎంతైనా తాత రక్తం తన బ్లడ్ లో ఉందిగా.

ఇంకా చదవండి ...

  మహమ్మద్ అలీ (Muhammad Ali) ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. తన పంచ్ లతో ప్రత్యర్ధులకు నిద్ర లేకుండా చేసిన విశ్వ విఖ్యాత బాక్సర్. మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి. 12 ఏళ్లకే బాక్సింగ్ అడుగుపెట్టి.. 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ గా ఎదిగారు అలీ. 1964లో దిగ్గజ బాక్సర్ సోనీలిస్టన్ పై గెలుపుతో ప్రపంచ ఛాంపియన్ గా మహ్మద్ అలీ నిలిచారు. తర్వాత ఇస్లాం మతం స్వీకరించి మహ్మద్ అలీగా పేరు మార్చుకున్నారు. 1967లోనూ హెవీవెయిట్ టైటిల్ సొంతం చేసుకున్నారు. 1964, 1974, 1978ల్లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ గా నిలిచారు. తన బాక్సింగ్ కెరీర్ లో ఐదుసార్లు మాత్రమే మహ్మద్ అలీ ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఆయన మనవడు కూడా రింగ్ లో తన పంచ్ లతో ప్రత్యర్ధుల్ని వణికిస్తున్నాడు. మహమ్మద్ అలీ మనవడు నికో అలీ వాల్ష్ (Nico Ali Walsh).. ఒక్లహోమాలో జరిగిన మిడిల్ వెయిట్ బౌట్ లో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. అరంగ్రేటంలోనే ఎంతో అనుభవమున్న ప్రత్యర్థిని చిత్తు చేసి తాతకు తగ్గ మనవడు అన్పించుకున్నాడు. 21 ఏళ్ల నికో అలీ వాల్ష్ ఫస్ట్ అమెచ్యూర్ కేటగిరీలో పోటీ పడే వాడు. అయితే, ఇప్పుడు మిడిల్ వెయిట్ విభాగంలో ప్రో బాక్సర్ గా మారాడు.

  ఈ బౌట్ కి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. మహమ్మద్ అలీ ఫైటింగ్ ఈవెంట్లు నిర్వహించే బాబ్ ఆరమ్.. ఇప్పుడు మనవడు నికో వాల్ష్ మ్యాచ్ ల్ని కూడా నిర్వహించడం కొసమెరుపు. ఆరమ్ 1966 నుంచి 1978 వరకు మహమ్మద్ అలీ ఫైట్లను దగ్గరుండి నిర్వహించే వారు.నికో వాల్ష్ చికాగోలో జన్మించాడు. అయితే, చిన్నప్పుడు నికో వాల్ష్ కు బాక్సింగ్ అంటే ఇష్టం ఉండేది కాదు. అయితే, 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు బాక్సింగ్ నే సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టాడు.

  ఆ తర్వాత బాక్సింగ్ తన కెరీర్ గా మార్చుకున్నాడు. ఎంతైనా తాత రక్తం తన బ్లడ్ లో ఉందిగా. 2016 లో మహమ్మద్ అలీ మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు తాత పక్కనే ఉన్నాడు నికో అలీ. తాత పర్యవేక్షణలోనే బాక్సింగ్ నైపుణ్యాలు నేర్చుకున్నాడు. 35 అమెచ్యూర్ బాక్సింగ్ బౌట్లలో పాల్గొన్న అనుభవంతో ప్రో బాక్సింగ్ లో రెచ్చిపోయాడు నికో అలీ. ప్రత్యర్థిని కేవలం నిమిషం 49 సెకన్లకే నాకౌట్ చేశాడు. ఇప్పుడు నికో అలీ ఓ సెలబ్రిటీగా మారిపోయాడు.

  ఇక, మహమ్మద్ అలీ గొప్ప ఛాంపియన్ గా, మానవతావాదిగా పేరొందినప్పటికీ ఆయన కెరీర్ వివాదాస్పదంగా కొనసాగింది. 1967లో అమెరికా-వియత్నాం యుద్ధ సమయంలో అలీని అమెరికా ఆర్మీలో పనిచేయడానికి ఎంపిక చేశారు. కానీ, ఆర్మీ ఆఫర్ ను అలీ తిరస్కరించారు. శక్తివంతమైన అమెరికా కోసం పేద ప్రజలపై పోరాడనని తేల్చి చెప్పారు. మరికొన్ని వివాదాలతో అలీ బాక్సింగ్ టైటిల్ వదులుకున్నారు. ఐదేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించారు.న్యాయ పోరాటం తర్వాత తిరిగి బాక్సింగ్ రింగ్ లోకి దిగిన మహ్మద్ అలీ 1974లో ఫ్రేజియర్ పై గెలుపొంది ఛాంపియన్ షిప్ సొంతం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ తో పాటు మరెన్నో పోటీల్లో అద్భుత విజయాలు సాధించారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: America, Boxing, Sports, USA

  ఉత్తమ కథలు