Home /News /sports /

MEET A 14 YEAR OLD CHINESE GIRL NAMED ZHANG ZIYU IS RECEIVING A LOT OF APPRECIATION IN INTERNET FOR HER STELLAR BASKETBALL SKILLS VIRAL VIDEO GH SRD

Viral Video: బాస్కెట్‌ బాల్‌ ఆటలో చైనా యువతి ప్రావీణ్యం..వరంగా మారిన ఎత్తు..ఆమె హైట్ ఎంతో తెలుసా..?

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral: ఎత్తు ఆమెకు వ‌రంగా మారింది. దీంతో బాస్కెట్‌బాల్‌లో దుమ్ము రేపుతోంది. బుట్ట‌లో ప‌ళ్ళు పెట్ట‌కున్నంత ఈజీగా ఆమె బంతిని బాస్కెట్‌లో వేస్తోంది.

చైనాకు చెందిన జాంగ్‌జియు అనే 14 ఏళ్ళ అమ్మాయి బాస్కెట్‌బాల్‌ ఆటతో అందరినీ ఆకట్టుకుటోంది. 7 అడుగుల 4 అంగుళాల పొడ‌వు ఉన్న ఆమె.. పోటీ జట్ల ఓటమిని శాసిస్తోంది. ఈ పొడ‌గ‌రి తన అద్భుత బాస్కెట్‌బాల్ నైపుణ్యాలతో సీనియర్ల ప్ర‌శంస‌లూ అందుకుంటోంది. చైనాలోని అండర్ -15 ఛాంపియన్‌షిప్‌లో ఆమె 42 పాయింట్లు సాధించి తన జట్టు గెలుపున‌కు బాట‌లు వేసింది. ఆమె ఆడిన మ్యాచ్‌లోని ఓ క్లిప్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. దీనికి కార‌ణం ఆమె ఎత్తు 7 అడుగుల నాలుగు అంగుళాలు ఉండ‌ట‌మే. ఎత్తు ఆమెకు వ‌రంగా మారింది. దీంతో బాస్కెట్‌బాల్‌లో దుమ్ము రేపుతోంది. బుట్ట‌లో ప‌ళ్ళు పెట్ట‌కున్నంత ఈజీగా ఆమె బంతిని బాస్కెట్‌లో వేస్తోంది. దీంతో నెటిజ‌న్లు ఈమె ఎత్తుకు ఈమె ఆట‌తీరుకు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. చైనా హుబీ ప్రావిన్స్‌లోని జింగ్‌జాంగ్‌లో జ‌రిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్‌లో ఈ అమ్మాయి 25 రీబౌండ్ల‌తో పాటు ఆరు షాట్ల‌ను కూడా అడ్డుకుందంటే ఈమె ఏ రేంజ్‌లో ఆడిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ మ్యాచ్‌లోని క్లిప్‌ను చైనాలో ప్ర‌సిద్ధ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ అయిన వీబో త‌న పేజీల‌లో షేర్ చేసింది. అనేక బాస్కెట్ బాల్ సంబంధిత ఛాన‌ల్స్ ఈ వీడియోనూ తమ ఛాన‌ల్స్‌లో ప్ర‌చురించ‌డంతో జాంగ్‌జియు ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయారు. చైనా బాస్కెట్‌బాల్ స్టార్ యావో మింగ్‌తో ఆమెను పోల్చ‌డం ప్రారంభించారు. పైగా వీరిద్ద‌రూ కూడా 7అడుగుల 4అంగుళాలే ఉండ‌టం విశేషం. ఈ వీడియోను ఇప్ప‌టికే 1.2 మిలియ‌న్ల మంది వీక్షించారు. ఇంకా ఈ వీడియో చూసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

నెటిజ‌న్లు ఈమె ఎత్తును చూసి షాక్ అవుతున్నారు. దీంతోపాటు బాస్కెట్‌బాల్ లో ఆమె చూపుతున్న నైపుణ్యానికీ ఫిదా అవుతున్నారు. దీనిపై నెటిజ‌న్లు ప‌లుర‌కాలుగా స్పందిస్తున్నారు. అస‌లీ రోజుల్లో పిల్ల‌లు ఏం తింటున్నారు అని ఒక నెటిజ‌న్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. అయితే ఈమె ఎత్తును ప్ర‌తికూల‌త‌గా భావించేవారూ ఉన్నారు.


జాంగ్‌జియు షాన్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన అమ్మాయి అని గ్లోబ‌ల్ టైమ్స్ తెలిపింది. ఈమె త‌ల్లిదండ్రులిద్ద‌రూ కూడా బాస్కెట్ బాల్ క్రీడాకారులే కావ‌డంతో జాంగ్ జియుకు పుట్టుక‌తోనే బాస్కెట్‌బాల్‌పై మోజు ఏర్ప‌డింది. మ‌రో విశేషం ఏమిటంటే ఈమె తండ్రి 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉంటే.. త‌ల్లి 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Basket Ball, China, Sports, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు