సాధారణంగా ఈత రాని వాళ్లు నీటిని చూస్తేనే భయపడిపోతారు. అయితే ఈత వచ్చినా సరే, సముద్రంలో స్విమ్మింగ్ చేయాలంటే చాలామంది భయపడతారు. ఎందుకంటే సముద్రంలో పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు. కానీ ఇలాంటి భయాలను లెక్క చేయకుండా ఈతలో రికార్డు సృష్టించింది ఇంగ్లాంగ్కు చెందిన 23 ఏళ్ల యువతి. ఏకంగా బ్రిటన్ లెన్త్ ఎంత ఉందో, అన్ని కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇంగ్లాండ్‌లోని నార్త్ యార్క్‌షైర్ (North Yorkshire) కౌంటీ.. థిర్స్క్ (Thirsk) అనే ప్రాంతానికి చెందిన జాస్మిన్ హారిసన్ (Jasmine Harrison) అనే యువతి ఈ రికార్డు సృష్టించింది.
జాస్మిన్ స్విమ్మింగ్ టీచర్. 23ఏళ్ల ఈ యువతి బ్రిటన్‌కు రెండు సరిహద్దుల మధ్య ఉన్న సముద్ర తీరంలో 900 మైళ్లు స్విమ్మింగ్ చేసింది. ఇలా ల్యాండ్స్ ఎండ్ (Land’s End ) నుంచి జాన్ ఓ గ్రోట్స్ (John O’Groats) వరకు ఈత కొట్టింది. మంగళవారం నాటికి ఈ స్విమ్మింగ్ పూర్తి కాగా, ఇందుకు మూడున్నర నెలల సమయం పట్టింది.
* తొలి మహిళ
బ్రిటన్ పొడవుతా స్విమ్ చేసిన రికార్డును ఆల్రెడీ ఇద్దరు క్రియేట్ చేశారు. 2013లో సీన్ కాన్వే(Sean Conway), 2018లో రోజ్ ఎడ్గ్లే(Ross Edgley) ల్యాండ్స్ ఎండ్ నుంచి జాన్ ఓ గ్రోట్స్ వరకు స్విమ్ చేశారు. అయితే తాజాగా ఈ జాబితాలో చేరిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పింది జాస్మిన్. స్వచ్ఛంద సంస్థలకు సాయం చేయడం కోసమే తాను ఛాలెంజ్‌గా బ్రిటన్ పొడవుతా అన్ని కిలోమీటర్ల పాటు స్విమ్మింగ్ చేశానని ఈమె వెల్లడించింది. సీ షెపర్డ్ UK అనే సముద్ర సంరక్షణ స్వచ్ఛంద సంస్థ బ్రిటన్‌లోని సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
* ప్లానింగ్, షెడ్యూల్ ప్రకారమే
జాస్మిన్ ఈ ఏడాది జులై 1న వెస్ట్రన్ కార్న్‌వాల్‌లోని ల్యాండ్స్ ఎండ్ వద్ద సముద్రపు నీటిలోకి ఎంటర్ అయింది. అప్పటి నుంచి రోజుకు 4 నుంచి 12 గంటల పాటు స్విమ్మింగ్ చేస్తూ ముందుకు సాగింది. స్విమ్మింగ్ టైమ్‌ను జాస్మిన్ రెండు షిఫ్టులుగా డివైడ్ చేసుకుంది. ఈత కొట్టడం అయిపోయిన తర్వాత తినడానికి, నిద్రించడానికి బ్రేక్స్ తీసుకుంది. సపోర్టు బోట్లో ఆమె రెస్ట్ తీసుకునేది. ఈమె లాంగెస్ట్ స్విమ్ 12 గంటల పాటు కొనసాగగా, ఒక షిఫ్ట్‌లో ఒకసారి సుమారు 16 మైళ్లు ఈదినట్లు తెలిపింది. ఒక రోజులో అత్యధికంగా 31 మైళ్లు స్విమ్ చేసింది. చాలాసార్లు రాత్రిపూట కూడా స్విమ్మింగ్ చేసినట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి : ‘30 శాతం మాత్రమే’.. టీమిండియాపై వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
రాయల్ నేవీ, రాయల్ ఎయిర్ ఫోర్స్, బ్రిటీష్ సైన్యంతో పాటు ఇతర దేశాల బలగాలతో కూడిన యూరప్‌లోని అతిపెద్ద సైనిక విన్యాసమైన జాయింట్ వారియర్ ఎక్సర్సైజెస్లోనూ జాస్మిన్ పాల్గొనడం విశేషం. ఈ సాహసోపేతమైన ప్రయాణంలో శారీరక, మానసిక సవాళ్లున్నాయని స్పష్టం చేసింది. జాస్మిన్ ఇప్పటికే అట్లాంటిక్ మీదుగా ఒంటరిగా ప్రయాణించిన అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు సృష్టించింది. తాజాగా బ్రిటన్ లెన్త్ వరకు స్మిమ్మింగ్ చేసి మరో రికార్డును సొంతం చేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Swimming, Trending news, VIRAL NEWS