#Me Too: పుల్లెల గోపిచంద్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన గుత్తా జ్వాల!

నా ప్రదర్శనతో సంబంధం లేకుండా జట్టు నుంచి తప్పిస్తూ వచ్చారు... ఈ వ్యక్తి ఛీఫ్ కోచ్ అయ్యాక నాకీ పరిస్థితి... సంచలనం సృష్టిస్తున్న గుత్తా జ్వాల ట్వీట్స్!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 9, 2018, 10:16 PM IST
#Me Too:  పుల్లెల గోపిచంద్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన గుత్తా జ్వాల!
గుత్తా జ్వాల (Getty Images)
  • Share this:
దేశవ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం ఊపందుకుంటోంది. సీనియర్ నటుడు నానాపటేకర్‌పై తనుశ్రీదత్తా చేసిన వ్యాఖ్యల తర్వాత పెను ఉప్పెనలా మొదలైన ‘మీ టూ’ మూమెంట్ ఇప్పుడు స్పోర్ట్స్‌ను కూడా తాకింది. తాజాగా భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. బాలీవుడ్ తారలు ‘లైంగిక వేధింపుల’ గురించి బయటపెడుతుంటే... గుత్తా జ్వాల మాత్రం ‘మానసిక వేధింపుల’ గురించి ప్రస్తావించి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా దేశానికి ఆడే క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ గురించి జ్వాల సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.





ట్వీట్టర్లో ట్రెండ్ అవుతున్న ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్ గురించి ప్రస్తావించిన గుత్తా జ్వాల... ‘నేను ఎదుర్కొన్న మెంటల్ హారాస్‌మెంట్ (మానసిక వేధింపులు) గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చిందనుకుంటా....’ అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత వరుస ట్వీట్లలో తాను ఎదురొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించింది గుత్తా జ్వాల.



‘2006 దాకా నేను జాతీయ జట్టులో ఉన్నాడు... 2006లో ఈ వ్యక్తి చీఫ్ అయ్యాక నన్ను జాతీయ జట్టు నుంచి తొలగించాడు. నేషనల్ ఛాంపియన్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే నన్ను తప్పించారు... ఈ మధ్య రియో ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాత మరోసారి జాతీయ జట్టులో నుంచి నేను తప్పించబడ్డాను... నేను బ్యాడ్మింటన్ ఆడకుండా రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇది ఓ కారణం....’ అంటూ ఆరోపించింది గుత్తా జ్వాల. పేరు ప్రస్తావించకపోయినప్పటికీ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ గురించే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతోంది.
2006 నుంచి 2016 దాకా... మళ్లీ...మళ్లీ నన్ను తప్పిస్తూ వచ్చారు... నా ప్రదర్శనతో సంబంధం లేకుండా నన్ను తొలగించారు. వరల్డ్ నెం. 9 ర్యాంక్ సాధించిన తర్వాత 2009లో జట్టులోకి వచ్చాను...
గుత్తా జ్వాల, మాజీ బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి



పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి సింగిల్స్ క్రీడాకారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ... డబుల్స్‌లో సంచలన విజయాలు సాధించిన వారిని మాత్రం సరిగ్గా పట్టించుకోవడం లేదనే కారణంగా గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాదీ క్రీడాకారిణి అయిన గుత్తా జ్వాల తన డబుల్స్ కెరీర్లో 5 స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు సాధించి భారత పతకాన్ని అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించిన విషయం తెలిసిందే.
Published by: Ramu Chinthakindhi
First published: October 9, 2018, 10:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading