• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • MAYANK FIGHTING INNINGS GAVE PBKS GOOD SCORE DELHI TO DEFEND 167 ON SLOW PITCH JNK

IPL 2021 : PBKS vs DC చెలరేగిన కెప్టెన్ మయాంక్.. తృటిలో సెంచరీ మిస్.. పంజాబ్‌కు డిఫెండబుల్ స్కోర్

కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన మయాంక్ అగర్వాల్

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ మోడీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ (Punjab Kings) డిఫెండబుల్ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ (12) మరోసారి విఫలమయ్యాడు. రబాడా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభుసిమ్రన్ పెవీలియన్ చేరాడు. ఇక కేఎల్ రాహుల్ గైర్హాజరీలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) ఒక్కడే ఒంటి చేత్తో ఇన్నింగ్స్ మొత్తం నడిపించాడు. మొదట కాస్త సమయం తీసుకున్నా ఆ తర్వాత బౌండరీలు, సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (13) ఒక సిక్స్, ఫోర్‌తో దూకుడుగా కనిపించినా.. రబాడ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అరంగేట్రం క్రికెటర్ డేవిడ్ మలన్ (23) దూకుడు మీదే కనిపించాడు. మయాంక్ అగర్వాల్, డేవిడ్ మలన్ కలసి 52 పరుగులు జోడించారు. అయితే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మలన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్‌లో దీపక్ హుడా (1) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరూ డబుల్ డిజిట్ సాధించలేదు. అయితే మయాంక్ అగర్వాల్ అక్కడి నుంచి బ్యాటింగ్ బాధ్యత మొత్తం తన భుజాలపై వేసుకున్నాడు.

    షారుక్ ఖాన్ (4), క్రిస్ జోర్డాన్ (2) తక్కువ స్కోరుకే అవుటైనా మయాంక్ మాత్రం సిక్సులు, ఫోర్లు కొడుతూ స్కోర్ వేగం పెంచాడు. ఒకానొక సమయంలో స్కోర్ 130 అయినా దాటుతుందా అనుకున్న సమయంలో మయాంక్ అగర్వాల్ తన వీరోచిత పోరాటంతో 160 దాటించాడు. చివరి వరకు క్రీజులో నిలబడి కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ అగర్వాలో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 166 పరుగుల చేసింది. రబాడాకు 3 వికెట్లు, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్‌కు చెరో వికెట్ లభించింది.





    ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బ్యాట్స్‌మాన్ డేవిడ్ మలన్ ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మాన్ క్రిస్ గేల్ అతడికి క్యాప్ అందించి జట్టులోకి ఆహ్వానించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో డేవిడ్ మలన్ కాస్త తడబడినట్లు కనిపించింది. ఇటీవల జరిగిన ఇండియా సిరీస్‌లో కూడా డేవిడ్ మలన్ ఆశించిన మేర రాణించలేదు. అతడు గత కొన్ని మ్యాచ్‌లుగా బ్యాటుతో రాణించడం లేదు. అయితే కేఎల్ రాహుల్ వంటి కీలక బ్యాట్స్‌మెన్ జట్టుకు దూరం కావడంతో అతడిని స్థానం కల్పించారు.
    Published by:John Naveen Kora
    First published: