ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ : కెరీర్ బెస్ట్ ర్యాంక్స్‌లో మయాంక్,షమీ

బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ ప్రదర్శన ద్వారా టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్, పేసర్ మహమ్మద్ షమీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకారు.

news18-telugu
Updated: November 17, 2019, 5:43 PM IST
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ : కెరీర్ బెస్ట్ ర్యాంక్స్‌లో మయాంక్,షమీ
మహమ్మద్ షమీ,మయాంక్ అగర్వాల్ (File Photo)
  • Share this:
బంగ్లాదేశ్‌పై ఉత్తమ ప్రదర్శన ద్వారా టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్, పేసర్ మహమ్మద్ షమీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకారు. బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో 243 పరుగులతో మయాంక్ వీర విహారం చేయడంతో.. 691 పాయింట్లతో 11వ ర్యాంక్ దక్కించుకున్నాడు.ఇక మహమ్మద్ షమీ.. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఏడు వికెట్లు కూల్చడంతో.. 790 పాయింట్లతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో నిలిచాడు.మయాంక్, షమీ ఇద్దరికీ ఇవి కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్ కావడం విశేషం. భారత్ తరుపున ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక పాయింట్స్ సాధించిన మూడో బౌలర్ షమీ కావడం విశేషం. షమీ కంటే ముందు స్థానాల్లో కపిల్‌దేవ్(877),జస్ప్రీత్ బుమ్రా(832) ఉన్నారు.

కాగా,బంగ్లాతో ఇండోర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా భారత బౌలర్ల ధాటికి 150 పరుగులకే చాప చుట్టేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 493/6 పరుగులు చేసింది.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన బంగ్లా 213 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది.First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు