హోమ్ /వార్తలు /క్రీడలు /

Mayank Agarwal : బాబు మయాంక్ అగర్వాల్...బుమ్రా పెళ్లాడింది మగాడ్ని కాదు...నెట్టింట్లో రచ్చ రచ్చ..

Mayank Agarwal : బాబు మయాంక్ అగర్వాల్...బుమ్రా పెళ్లాడింది మగాడ్ని కాదు...నెట్టింట్లో రచ్చ రచ్చ..

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన  బుమ్రా..

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బుమ్రా..

Mayank Agarwal : టీమిండియా స్టార్ పేసర్‌, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా నిన్న ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, మాజీ మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ సంజనా గణేశన్‌ను గోవాలో సన్నిహితుల సమక్షంలో సోమవారం వివాహమాడాడు. ట్విట్టర్ వేదికగా బుమ్రా తన పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. దీంతో బీసీసీఐ, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా చదవండి ...

టీమిండియా స్టార్ పేసర్‌, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా నిన్న ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, మాజీ మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ సంజనా గణేశన్‌ను గోవాలో సన్నిహితుల సమక్షంలో సోమవారం వివాహమాడాడు. ట్విట్టర్ వేదికగా బుమ్రా తన పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. దీంతో బీసీసీఐ, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే టీమిండియా టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్..‌ బుమ్రాకు కంగ్రాట్స్‌ చెబుతూ షేర్‌ చేసిన కామెంట్‌ అందరిలో నవ్వులు పూయించింది. జస్ప్రీత్ బుమ్రాకు శుభాకాంక్షలు తెలిపిన మయాంక్ అగర్వాల్‌ పొరపాటున అతని భార్య సంజనా గణేశన్‌కు బదులుగా.. టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌ పేరును ట్యాగ్‌ చేశాడు. 'కంగ్రాట్స్‌ జస్ప్రీత్ బుమ్రా.. సంజయ్‌ బంగర్‌! మీ వైవాహిక జీవితం బాగుండాలని, నిత్యం సంతోషంతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు. మయాంక్‌ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. "అయ్యో మయాంక్.. బుమ్రా భార్య సంజయ్‌ బంగర్‌ కాదు" అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే విషయం తెలుసుకున్న మయాంక్..‌ తన ట్వీట్‌ను వెంటనే డిలీట్‌ చేశాడు.

అంతకుముందు జస్ప్రీత్ బుమ్రా పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసి ఓ ట్వీట్ చేశాడు. "ప్రేమ.. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరు అదృష్టవంతులే. అదే మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. మేం ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఈ రోజు మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది" అని బుమ్రా పేర్కొన్నాడు. ఆపై మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా, వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ అందరూ బుమ్రా దంపతులను దీవిస్తూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

అత్యంత సన్నిహితుల మధ్యనే వివాహం చేసుకున్న బుమ్రా.. త్వరలోనే భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులందరికి విందు ఇవ్వనున్నట్లు వారి కుటుంబ వర్గాలు తెలిపాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లోనూ బుమ్రా ఆడటంపై సందేహాలు ఉన్నాయి.

First published:

Tags: Cricket, Jasprit Bumrah, Sanjana Ganesan, Team India

ఉత్తమ కథలు