హోమ్ /వార్తలు /క్రీడలు /

INDvsENG: రెండు నిమిషాల్లో స్టేట్‌మెంట్ మార్చిన ఈసీబీ.. తెర వెనుక ఏం జరిగింది? 5వ టెస్టు మళ్లీ ఎప్పుడంటే!!

INDvsENG: రెండు నిమిషాల్లో స్టేట్‌మెంట్ మార్చిన ఈసీబీ.. తెర వెనుక ఏం జరిగింది? 5వ టెస్టు మళ్లీ ఎప్పుడంటే!!

ఈసీబీ స్టేట్మెంట్ ఎందుకు మార్చింది? ఫాఫిట్ అంటే ఏంటి? (PC: ECB)

ఈసీబీ స్టేట్మెంట్ ఎందుకు మార్చింది? ఫాఫిట్ అంటే ఏంటి? (PC: ECB)

INDvsENG: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన 5వ టెస్టును రద్దు చేస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది. కోవిడ్ నేపథ్యంలో జట్టును బరిలోకి దింపలేకపోతున్నట్లు టీమ్ ఇండియా చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈసీబీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

ఇండియా - ఇంగ్లాండ్ (India vs England) మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం మాంచెస్టర్‌లో (Manchester) ప్రారంభం కావల్సిన 5వ టెస్టు రద్దు చేస్తే ఈసీబీ (ECB) నిర్ణయం తీసుకున్నది. అయితే ఈసీబీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో తొలుత 'మ్యాచ్ వదిలేసింది' (Forfeit) అని పేర్కొన్నది. కానీ నిమిషాల వ్యవధిలోనే ఆ పదాన్ని తొలగించి.. 'టీమ్‌ను పంపించలేకపోతున్నది' (Unable to field a team)గా మార్చేసింది. అయితే 5వ టెస్టు ఫలితం ఏమిటనే దానిపై ఈసీబీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. టెస్టు మ్యాచ్‌లో సాధారణంగా గెలుపు, ఓటమి, డ్రా, ఫలితం లేదు అనే రిజల్డ్స్ ఉంటాయి. మరి ఈ మ్యాచ్ ఎలా ముగిసింది అనే దానిపై క్లారిటీ లేదు. మిగిలిన టెస్టును మరోసారి నిర్వహిస్తారా? లేదంటే 2-1 తేడాతో పటౌడీ ట్రోఫీని (Patoudi Trophy) ఇండియా (Team India) గెలిచినట్లు ప్రకటిస్తారా అనే విషయంపై సందిగ్దత నెలకొన్నది.

ఫాఫిట్ అంటే ఏంటి?

క్రీడా పరిభాషలో ఫాఫిట్ అంటే ప్రత్యర్థి జట్టు లేదా ప్రత్యర్థి ఆటగాడు ఏదైనా కారణం చేత మ్యాచ్‌కు రాక పోవడంతో ఆ మ్యాచ్ ఓడిపోయినట్లు భావిస్తారు. ఫాఫిట్ ద్వారా మ్యాచ్ కోల్పోవడంతో ఎదుటి జట్టు విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురు కాదు. అయితే ద్వైపాక్షిక సిరీస్‌లలో మ్యాచ్ ఓడిపోతుంది.. అదే మూడు అంతకంటే ఎక్కువ జట్లు పాల్గొనే టోర్నీల్లో అయితే వాకోవర్ వస్తుంది. దీంతో ఆ మ్యాచ్ ఎదుటి జట్టు గెలిచినట్లు భావించి తర్వాత రౌండ్‌కు పంపుతుంటారు. అయితే ఇప్పుడు ఇండియా-ఇంగ్లాండ్ 5వ టెస్టు విషయంలో ఏం జరిగింది అనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

ఉదయం నుంచి తర్జనభర్జనలు..

బుధవారం టీమ్ ఇండియా అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్ కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారించబడిన దగ్గర నుంచి మ్యాచ్ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. గురువారం రాత్రి టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ నెగెటివ్‌గా తేలినా కొంత మంది మ్యాచ్ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈసీబీ-బీసీసీఐ అధికారుల మధ్య శుక్రవారం ఉదయం నుంచి చర్చలు జరిగాయి. బీసీసీఐ అధికారి ఒకరు మ్యాచ్ రద్దు చేయాలని కోరారు. మరో ఇద్దరు అధికారులు మాత్రం రెండు రోజుల పాటు వాయిదా వేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఈసీబీ అధికారులు తొలుత ఒక రోజు పాటు వాయిదా వేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏకంగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిమిషాల వ్యవధిలో స్టేట్మెంట్‌లోని మ్యాటర్ మార్చేయడం చర్చనీయాంశంగా మారింది.


యాషెష్ తర్వాత మరో టెస్టు?

పటౌడి సిరీస్‌లోని ఆఖరి టెస్టు మ్యాచ్‌ను వచ్చే ఏడాది నిర్వహించే అవకాశం ఉన్నది. టీమ్ ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌లో బిజీ అవుతుండగా.. ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ తర్వాత యాషెష్ ఆడాల్సి ఉన్నది. దీంతో ఆఖరి టెస్టును వచ్చే ఏడాది నిర్వహించాలని భావిస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23లో భాగం కాబట్టి.. ఇరు జట్లకు అన్యాయం జరగకుండా ఉండేందుకే రెండు క్రికెట్ బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

First published:

Tags: Bcci, India vs england, Test Cricket

ఉత్తమ కథలు