షకీబుల్ హాసన్‌కి తీవ్ర గాయం... 3 నెలల పాటు ఆటకు దూరం!

ఇంకొంచెం ఆలస్యమైతే... భుజానికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకుతుందని చెప్పిన డాక్టర్లు... మూడు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచన!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 30, 2018, 3:32 PM IST
షకీబుల్ హాసన్‌కి తీవ్ర గాయం... 3 నెలల పాటు ఆటకు దూరం!
ఇంకొంచెం ఆలస్యమైతే... భుజానికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకుతుందని చెప్పిన డాక్టర్లు... మూడు నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచన!
  • Share this:
ఆసియాకప్ ఫైనల్‌కి ముందే గాయం కారణంగా జట్టుకు దూరమైన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబుల్ హాసన్... మరో మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉండబోతున్నాడు. చేతి వేలి గాయంతో ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతూనే క్రికెట్ ఆడుతూ వచ్చిన షకీబుల్ హాసన్... గాయం తీవ్రత పెరగడంతో పాక్‌తో జరిగిన మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. మొదట షకీబుల్ హాసన్‌ను పరీక్షించిన డాక్టర్లు నాలుగైదు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. అయితే లిటిల్ ఫింగర్‌కి అయిన గాయం తీవ్రత పెరగడంతో మరో మూడు నెలల పాటు విశ్రాంతి కావాలని చెప్పారట వైద్యులు.

దీంతో జింబాబ్వేతో సిరీస్‌కు దూరమైన షకీబుల్ హాసన్... ఆ తర్వాత మరో రెండు నెలల పాటు జట్టుకు దూరం కాబోతున్నాడు. ఐసీసీ ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో నెం. 1 స్థానంలో కొనసాగుతున్న బంగ్లా మాజీ కెప్టెన్... కొన్నేళ్లుగా జట్టు విజయంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నాడు. షకీబుల్ హాసన్ సేవలు దూరమవ్వడం మేటి జట్లకు షాక్ ఇచ్చేంత అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న బంగ్లా టీమ్‌కి పెద్ద లోటే.

‘‘నేను హాస్పటిల్‌కు వెళ్లగానే డాక్టర్ నా చేతిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో జాయిన్ కావాలని చెప్పారు. ఇప్పటికే లేట్ అయ్యిందని, ఇంకొంచెం ఆలస్యమైతే... నా భుజానికి కూడా ఇన్‌ఫెక్షన్ సోకుతుందని చెప్పాడు... ఇంకొంచెం ఆలస్యం చేసి ఉంటే నా మడికట్టును కూడా తీసేసేవాళ్లేమో...’’ అంటూ చెప్పుకొచ్చాడు షకీబుల్ హాసన్. ఇంకా వేలికి సర్జరీ చేయలేదని.. ఆపరేషన్ చేసేందుకు రెండు, మూడు వారాల సమయం పడుతుందని, సర్జరీ తర్వాత కూడా మరో ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని చెప్పారని వివరించాడు షకీబుల్ హాసన్.
First published: September 30, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading