హోమ్ /వార్తలు /క్రీడలు /

నిఖత్ జరీన్‌ను చిత్తు చేసిన మేరీకోమ్.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత..

నిఖత్ జరీన్‌ను చిత్తు చేసిన మేరీకోమ్.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత..

మేరీకోమ్,నిఖత్ జరీన్ (Image: BFI)

మేరీకోమ్,నిఖత్ జరీన్ (Image: BFI)

టోక్యో ఒలింపిక్స్‌ కోసం జరిగిన బాక్సింగ్ ట్రయల్స్ ఫైనల్స్‌లో బాక్సర్ నిఖత్ జరీన్‌ను బాక్సింగ్ క్వీన్ మేరీ క్వీన్ ఓడించింది.

టోక్యో ఒలింపిక్స్‌ కోసం జరిగిన బాక్సింగ్ ట్రయల్స్ ఫైనల్స్‌లో బాక్సర్ నిఖత్ జరీన్‌ను బాక్సింగ్ క్వీన్ మేరీ క్వీన్ ఓడించింది. 51 కిలోల విభాగంలో జరిగిన ఈ ట్రయల్‌లో నిఖత్ జరీన్‌ ఏ దశలోనూ మేరీ కోమ్‌కు పోటీ ఇవ్వకపోవడంతో బౌట్ ఏకపక్షంగా ముగిసింది. 9-1 తేడాతో మేరీ కోమ్ జరీన్‌పై విజయం సాధించింది. మేరీకోమ్ అనుభవం ముందు నిఖత్ జరీన్ నిలబడలేకపోయింది. ఈ విజయంతో టోక్యో ఒలింపిక్స్‌కు మేరీకోమ్ అర్హత సాధించింది.

నిజానికి టోక్యో ఒలింపిక్స్ టోర్నీకి మేరీకోమ్‌నే పంపించాలని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) మొదట భావించింది. అయితే ట్రయల్ పోటీలు నిర్వహించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని బాక్సర్ నిఖత్ జరీన్ బీఎఫ్ఐకి విజ్ఞప్తి

చేసింది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజుకు కూడా ఆమె లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బీఎఫ్ఐ నిబంధనల ప్రకారం ట్రయల్ పోటీలు నిర్వహించింది. శుక్రవారం జరిగిన ట్రయల్ పోటీల్లో నిఖత్ జరీన్.. జాతీయ చాంపియన్ జ్యోతి గులియాపై విజయం సాధించింది. మరో బౌట్‌లో మేరీకోమ్.. బాక్సర్ రీతు గ్రెవాల్‌పై విజయం సాధించింది. దీంతో నిఖత్ జరీన్,మేరీకోమ్ ఫైనల్ ట్రయల్స్‌లో తలపడగా మేరీకోమ్ విజయం సాధించింది.

ఇది కూడా చదవండి : మేరీ కోమ్ కోసం మమ్మల్ని బలి చేస్తారా.. : ఓ యువ బాక్సర్ ఆవేదన

సవాల్ చేయడం సులువు.. రింగ్‌లో గెలవడమే కష్టం : నిఖత్‌ జరీన్‌కు మేరీ కోమ్ కౌంటర్

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి రియాక్షన్..

First published:

Tags: Mary Kom, Nikhat Zareen, Olympics

ఉత్తమ కథలు