• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • MANOJ TIWARY ELECTED FROM SHIBPUR CONSTITUENCY HES STILL AN CRICKETER AND NOT DECLARED HIS RETIREMENT JNK

Cricket : ఆ క్రికెటర్ ఇప్పుడు ఎమ్మెల్యే.. బెంగాల్ అసెంబ్లీకి పోటీ చేసి గెల్చిన టీమ్ ఇండియా క్రికెటర్

Cricket : ఆ క్రికెటర్ ఇప్పుడు ఎమ్మెల్యే.. బెంగాల్ అసెంబ్లీకి పోటీ చేసి గెల్చిన టీమ్ ఇండియా క్రికెటర్

బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికైన క్రికెటర్ మనోజ్ తివారి

  • Share this:
    పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీకి జరిగిన ఎన్నికల (Elections) ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో టీమ్ ఇండియాకు (Team India) ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్  (Cricketer) గెలుపొందాడు. గతంలో టీమ్ ఇండియా తరపున ఆడిన మనోజ్ తివారి (Majoj Tiwary) ఈ ఏడాది ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ ‌లో చేరాడు. ఆయనకు బెంగాళ్‌లోని షిబ్‌పూర్ అసెంబ్లీ టికెట్‌ను టీఎంసీ అధినేత మమత బెనర్జీ కేటాయించారు. అప్పటి నుంచి విస్తృతంగా ప్రచారం చేసిన మనోజ్ తివారి ఎన్నికల వేళ బాగా కష్టపడ్డాడు. నిన్న వెలువడిన ఫలితాల్లో తన సమీప బీజేపీ అభ్యర్థి రథిన్ చక్రబర్తిపై మనోజ్ తివారి 6 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందాడు. జనరల్ కేటగిరీకి చెందిన ఈ నియోజకవర్గంలో 2016లో ఏఐఎఫ్‌బీకి చెందిన అభ్యర్థి విజయం సాధించాడు. అంతకు ముందు టీఎంసీకి చెందిన జతు లాహిరి గెలుపొందాడు. కానీ మమత బెనర్జీ అనూహ్యంగా ఈ సీటును క్రికెటర్ అయిన మనోజ్ తివారీకి కేటాయించింది. ఈ నియోజకవర్గంపై మమత కూడా పెద్దగా దృష్టి సారించలేదు. అయినా సరే తివారి తన స్వశక్తితో ఇక్కడ ప్రచారం చేసి గెలుపొందాడు.

    1985 నవంబర్ 14న హౌరాలో జన్మించిన మనోజ్ తివారి చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద దృష్టిపెట్టాడు. కుడి చేతి వాటం బ్యాట్స్‌మాన్, లెగ్ స్పిన్నర్‌గా కెరీర్ ప్రారంభించాడు. పవ్చిమ బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడిన మనోజ్.. జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. మనోజ్ తివారి టీమ్ ఇండియా తరపున 2008లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేశాడు. 2012 టీ20 వరల్డ్ కప్ జట్టులో మనోజ్ తివారి సభ్యుడిగా ఉన్నాడు. తన కెరీర్‌లో 12 వన్డేలు, 2 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, మరో అర్దసెంచరీ చేసిన మనోజ్ టీ20ల్లో మాత్రం విఫలం అయ్యాడు.

    ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున ఆడాడు. 20018 ఐపీఎల్ సీజన్ అతడికి చివరిది. పంజాబ్ జట్టు అతడిని 2018లో రూ.1 కోటికి కొనుక్కున్నది. 2018-19 సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ తరపున అత్యధిక స్కోర్ రికార్డు మనోజ్ తివారి పేరిటే ఉన్నది. మనోజ్ తివారి 119 ఫస్ట్ క్లాస్, 163 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మనోజ్ తివారి ఒక ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. తివారి చివరి సారిగా 2012 సెప్టెంబర్ 11న న్యూజీలాండ్ తరపున టీ10 మ్యాచ్ ఆడాడు. కాగా, తివారి ఇంత వరకు తన క్రికెట్ కెరీర్‌కు అధికారికంగా క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు