నిజంగానే మినీ ఐపీఎల్ నిర్వహిస్తారా.. అలా అని చెప్పిందెవరంటే..

ఏటా నిర్వహించే ఐపీఎల్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మినీ ఐపీఎల్ నిర్వహించవచ్చని రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని మనోజ్ బదల్ అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: April 1, 2020, 3:17 PM IST
నిజంగానే మినీ ఐపీఎల్ నిర్వహిస్తారా.. అలా అని చెప్పిందెవరంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రతి సంవత్సరం భారత్‌లో నిర్వహించే ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌కు క్రీడాభిమానుల్లో ఉండే ఆసక్తి అంతాఇంతా కాదు. సీజన్ మొదలైనప్పట్నుంచీ.. ముగిసే వరకు అభిమానులకు దాదాపు అదే ధ్యాస. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా అసలు ఆ టోర్నీ నిర్వహణపైనే నీలినీడలు కమ్మేశాయి. వాస్తవానికి ఐపీఎల్ 13వ సీజన్ టోర్నీ మార్చి 29న ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దాన్ని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు.

కానీ కరోనా కారణంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అసలు టోర్నీ నిర్వహించడం సాధ్యమవుతుందా.. లేదా అన్న అనుమానం క్రీడాభిమానుల్లో రోజురోజూకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని మనోజ్ బదలే స్పందిస్తూ ఐపీఎల్‌ను పూర్తి స్థాయిలో కాకపోయినా.. మినీ ఐపీఎల్ అయినా నిర్వహించవచ్చన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేక తరహాలోనైనా ఐపీఎల్ ఉంటుందని, బోర్డు సభ్యులంతా కలిసి టోర్నీని నిర్వహించేందుకు ప్రయత్నించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

క్రికెట్‌కు ఈ టోర్నీ ఎంతో ముఖ్యం. ఐపీఎల్ వల్ల చాలామంది దేశీయ ఆటగాళ్లకూ స్వాంతన చేకూరుతుందని, ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తుందని పేర్కొన్నారు. స్టార్ క్రికెటర్లు, నిర్వాహకులు, బ్రాడ్ కాస్టర్స్‌కు ఆర్థికంగా దోహదపడుతుందని, టోర్నీ నిర్వహణ కోసం సాధ్యమైనంత మేరకు ప్రయత్నిస్తామని మనోజ్ చెప్పుకొచ్చారు.
First published: April 1, 2020, 3:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading