భళా స్ట్రోక్స్‌.. కసి తీర్చుకున్న ఇంగ్లాండ్

మెుదటి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన విండీస్ రెండో టెస్ట్‌లో చతికిలాపడింది. తొలి టెస్ట్‌లా విండీస్ స్ఫూర్తిదాయక ప్రదర్శన కోనసాగించలేకపోయింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది.

Rekulapally Saichand
Updated: July 21, 2020, 3:00 PM IST
భళా స్ట్రోక్స్‌..  కసి తీర్చుకున్న ఇంగ్లాండ్
లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల సంబరాలు (ICC/Twitter)
  • Share this:
ఇంగ్లాండ్ కసి తీర్చుకుంది. వెస్టిండీ్‌సతో జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. 312 పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన వెస్టిండీస్  191 రన్స్‌కే కుప్పకూలింది.

అంతకుముందు రోజు 37/2 స్కోరుతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ స్ట్రోక్ హాఫ్‌ సెంచరీతో స్కోరును పరుగులు పెట్టించాడు. ఇక స్టోక్స్‌కు స్ట్రయిక్‌ ఇచ్చే ప్రయత్నంలో రూట్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో 19 ఓవర్లలోనే ఇంగ్లండ్‌ 129/3తో  రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

తర్వాత బరిలోకి దిగిన వెస్టిండిస్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి చేశారు. తొలి ఓవర్లనే బ్రాత్‌వైట్‌ను అవుట్‌ చేసిన బ్రాడ్‌ విండీస్‌ను దెబ్బతీశాడు. తర్వాత కరెబియన్ బాట్స్‌మెన్ ఇంగ్లీష్ బౌలర్ల దాటికి నిలవలేకపోయారు. దీంతో భోజన విరామ పమయానికి విండీస్ 3 వికెట్లను కొల్పోయి 25 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా వెస్టిండీస్ పతనం కొనసాగింది.  చివర్లో బ్రూక్స్‌, బ్లాక్‌వుడ్‌ పోరాడిన ఫలితం లేకపోయింది.

మెుదటి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన విండీస్ రెండో టెస్ట్‌లో చతికిలాపడింది. తొలి టెస్ట్‌లా విండీస్  స్ఫూర్తిదాయక ప్రదర్శన కోనసాగించలేకపోయింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది.
Published by: Rekulapally Saichand
First published: July 21, 2020, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading