MAHENDRA SINGH DHONI WIFE SAKSHI AND VIRAT KOHLI WIFE ANUSHKA SHARMA RARE PIC GOES VIRAL IN SOCIAL MEDIA SRD
Viral : అనుష్క శర్మ, ధోనీ భార్య సాక్షి ల వైరల్ పిక్..వీరిద్దరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
Photo Credit : Twitter
Viral : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో సామాన్యుల నుండి రాజకీయ నాయకులు, నటీనటుల వరకు దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క విషయాలను సోషల్ మీడియా వేదికగా తమ ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు.
సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటుల వ్యక్తిగత పరిచయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులకు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్ల నిజజీవితంలో జరిగిన సంఘటనలను, వాళ్ల అభిరుచులను ఇలా ఎన్నో రకాలుగా నటీ నటుల గురించి తెలుసుకోవాలని ఉంటుంది. సెలబ్రెటీల చిన్ననాటి వీడియోలు , ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడం కామన్. చాలామంది నటీనటులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో సామాన్యుల నుండి రాజకీయ నాయకులు, నటీనటుల వరకు దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క విషయాలను సోషల్ మీడియా వేదికగా తమ ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు. ఇదే కోవలో ఇద్దరి సెలబ్రిటీలో ఓ త్రో బ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో ఉంది.. అలాంటి ఇలాంటి వాళ్లు కాదు. టీమిండియా మాజీ సారథి భార్య ఒకరైతే, ప్రస్తుత కెప్టెన్ సతీమణి మరొకరు. వాళ్లు ఎవరో కాదు.. సాక్షి సింగ్ ధోనీ మరియు అనుష్క శర్మ. వీళ్లిద్దరూ చిన్నప్పుడూ క్లాస్ మేట్స్. అస్సాంలోని ఓ స్కూల్ లో వీళ్లద్దరి చదువు కొనసాగింది. అప్పుడు తీసుకున్న ఫోటో ఇది.
ఆ తర్వాత కూడా వీళ్లద్దరూ కలిసిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. మరోవైపు, వీళ్లిద్దరికీ నిజజీవితంలో చాలా కామన్ పోలీకలున్నాయ్. ఇక సాక్షి.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ని పెళ్లి చేసుకుని.. కూతురికి జన్మనిచ్చింది. అనుష్క శర్మ కూడా ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని పెళ్లి చేసుకుని కూతురికే జన్మనిచ్చింది.
సాక్షి ధోనీ - అనుష్క శర్మ రేర్ పిక్
ప్రస్తుతం ధోనీ, కోహ్లీలిద్దరూ ఐపీఎల్ 2021 సీజన్ లో యమా బిజీగా గడిపేస్తున్నారు. సాక్షి, అనుష్క శర్మ లు ఎప్పటికప్పుడూ తమ అప్ డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. ఈ త్రో బ్యాక్ అనుష్క శర్మ ఫ్యాన్స్ క్లబ్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.