Dhoni | ధోనీ నీకో దండం... విరాట్ కోహ్లీ సంచలనం..

Dhoni retirement | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

news18-telugu
Updated: September 12, 2019, 4:45 PM IST
Dhoni | ధోనీ నీకో దండం... విరాట్ కోహ్లీ సంచలనం..
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ (Image:Virat Kohli/Twitter)
news18-telugu
Updated: September 12, 2019, 4:45 PM IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెను దుమారం రేపారు. విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాంలో ధోనీకి సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ధోనీ నిలబడి ఉండగా కోహ్లీ అతడికి సెల్యూట్ చేస్తున్నట్టుగా ఆ ఫొటో ఉంది. ‘ఆ రోజు రాత్రి. ఆ ఆటను నేను మర్చిపోలేను. ఈ మనిషి (ధోనీ) నన్ను ఫిట్ నెస్ టెస్ట్ కోసం అన్నట్టుగా పరిగెత్తించాడు.’ అని ధోనికి ట్యాగ్ చేసి కామెంట్ చేశాడు. వరల్డ్ కప్ ‌లో సెమీస్ నుంచి వెనుదిరిగిన తర్వాత రెండు నెలల పాటు ధోనీ క్రికెట్‌ నుంచి విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరాడు. ఆ తర్వాత టీమిండియా రెండు టూర్లకు (వెస్టిండీస్, దక్షిణాఫ్రికా) మిస్టర్ కూల్ దూరంగా ఉన్నాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ధోనీ ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాడనే ప్రచారం బయటకువచ్చింది. దీంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు ధోనీ మీద విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ కూడా మాజీ కెప్టెన్ రిటైర్ అవుతున్నాడనే సంకేతాన్ని పంపిస్తోంది.



First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...