MAHENDRA SINGH DHONI ROPED IN TO BE THE BRAND AMBASSADOR AND SHAREHOLDER IN DRONE START UP GARUDA AEROSPACE SRD
MS Dhoni : ధోని నయా ఇన్నింగ్స్.. లాభసాటి వ్యాపారంలోకి మహీ అడుగులు..
MS Dhoni
MS Dhoni : కేవలం క్రికెట్ వల్లే కాదు.. ధోనీకి ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో రిటైర్మెంట్ తీసుకున్నా సరే.. ధోనీ సంపద ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.
ఎం ఎస్ ధోనీ (MS Dhoni).. కోట్లాది మంది భారతీయుల మనసుల్లో నిలిచిపోయిన ఆటగాడు. భారత్ కి ఎన్నో విజయాలను అందించి అభిమానులను సంపాదించుకున్నాడు ధోనీ. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్(International Cricket) కి గుడ్ బై చెప్పినా.. ఐపీఎల్(IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరపున ఆడుతున్నాడు. అయితే కేవలం క్రికెట్ వల్లే కాదు.. ధోనీకి ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో రిటైర్మెంట్ తీసుకున్నా సరే.. ధోనీ సంపద ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇటు బ్రాండ్ ఎండార్స్ మెంట్లు, అటు బిజినెస్(Business) లు ధోనీ ఆస్తుల విలువను పెంచుతున్నాయి. ధోని కూడా తగ్గేదే లే అన్నట్టుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.
తాజాగా.. మహేంద్ర సింగ్ ధోని కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నాడు. గత కొద్దికాలంగా దేశంలో భారీగా పెట్టుబడులు ఆశిస్తున్న డ్రోన్స్ బిజినెస్ లోకి ధోని కాలుమోపాడు. ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పెట్టుబడులు పెట్టాడు. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 26 నగరాల్లో 300 డ్రోన్లు, 500 మంది పైలెట్లు పనిచేస్తున్నారు.
దేశంలో డ్రోన్ల పెరుగుదల ఆవశ్యకతను తెలియజేస్తూ ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాలు ఇటీవలే ఈ సంస్థ చేస్తున్న కృషి ని కొనియాడారు. తాజాగా ధోని.. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. ఈ విషయంపై ధోని మాట్లాడుతూ 'గరుడా ఏరోస్పేస్ లో పెట్టుబడులు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లు అందించే ప్రత్యేకమైన డ్రోన్లతో వారి వృద్ధిని చూడటానికి ఎదురుచూస్తున్నాను..' అని ఓ ప్రకటనలో తెలిపాడు.
ఇక పెట్టుబట్టులు పెట్టడమే కాకుండా.. ఈ సంస్థకు ధోని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేయనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వత ధోని వ్యవసాయాధారిత, వస్త్ర, లిక్కర్, మోటార్ కార్ రంగాలలో విరివిగా పెట్టుబడులు పెడుతున్నాడు. ఝార్ఖండ్ లోని చిన్న పట్టణం రాంచీకి చెందిన ధోనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు.
స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్, ఖాతాబుక్, 7ఇంక్ బ్రూస్, కార్స్ 24, హోమ్ లోన్, స్పోర్ట్స్ ఫిట్, హోటల్ మహి రెసిడెన్సీ వంటి సంస్థలలో కూడా ఈ జార్ఖండ్ డైనమైట్ కు పెట్టుబడులున్నాయి. వీటితో పాటు పలు క్రీడలకు చెందిన లీగుల్లో కూడా ధోని పెట్టుబడులు పెట్టాడు. చెన్నయిన్ ఫుట్బాల్ క్లబ్, హాకీ క్లబ్ రాంచీ రేస్ , మాహీ రేసింగ్ టీమ్ ఇండియా వీటిలో కూడా మహేంద్రుడు పెట్టుబడులు పెట్టాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.