news18-telugu
Updated: August 17, 2019, 10:38 PM IST
లేహ్‌లో పిల్లలతో క్రికెట్ ఆడుతున్న ధోనీ (Image:Chenni Super Kings/ Instagram)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ ఆడుతూ కనిపించాడు. జమ్మూకాశ్మీర్‌లోని లేహ్‌లో హిమాలయాల పాదల చెంత చిన్న పిల్లలతో క్రికెట్ ఆడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాస్కెట్ బాల్ గ్రౌండ్లో సిమెంట్ పిచ్ మీద ధోనీ భారీ షాట్ ఆడినట్టిగా ఉన్న ఫొటోను చెన్నై ఐపీఎల్ అనే ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. లదాఖ్‌లో ఓ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని ధోనీ హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇటీవల క్రికెట్ వరల్డ్ కప్‌లో సెమీస్ వరకు చేరిన టీమిండియా చివర్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత క్రియాశీలక క్రికెట్ నుంచి ధోనీ రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఆర్మీకి సేవలందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జూలై 30న జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు దళంలో జాయిన్ అయ్యాడు. అక్కడ రెండు వారాల పాటు సేవలు అందించాడు. గత బుధవారం లదాఖ్ వెళ్లాడు. అక్కడ ఆర్మీ అధికారులు మహీకి స్వాగతం పలికారు. స్థానిక ఆర్మీ ఆస్పత్రిని కూడా ధోనీ సందర్శించాడు. ఆస్పత్రిలో రోగులను పలకరించాడు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 17, 2019, 10:35 PM IST