ఝార్ఖండ్ ఎన్నికల్లో ఓటువేసిన ఎంఎస్ ధోనీ

డిసెంబరు 16న నాలుగో దశ, డిసెంబరు 20న ఐదో దశ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

news18-telugu
Updated: December 12, 2019, 4:24 PM IST
ఝార్ఖండ్ ఎన్నికల్లో ఓటువేసిన ఎంఎస్ ధోనీ
ఓటువేసిన ధోనీ
  • Share this:
ఝార్ఖండ్ అసెంబ్లీకి గురువారం మూడో విడత పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాంచీలోని ఓ పోలింగ్ కేంద్రానికి భార్య సాక్షితో వచ్చిన ధోనీ ఓటు వేశారు. గ్రే కలర్ స్వెట్‌సర్ట్, బ్లూ జీన్స్‌, కళ్లద్దాలు ధరించి చాలా కాజువల్‌గా కనిపించారు ధోనీ. ఈ సందర్భంగా ధోనీతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
మూడో విడతలో భాగంగా ఝార్ఖండ్‌లో 17 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసింది. ఇక మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. డిసెంబరు 16న నాలుగో దశ, డిసెంబరు 20న ఐదో దశ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
Published by: Shiva Kumar Addula
First published: December 12, 2019, 4:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading