ఎం ఎస్ ధోనీ (MS Dhoni).. కోట్లాది మంది భారతీయుల మనసుల్లో నిలిచిపోయిన ఆటగాడు. భారత్ కి ఎన్నో విజయాలను అందించి అభిమానులను సంపాదించుకున్నాడు ధోనీ. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్(International Cricket) కి గుడ్ బై చెప్పినా.. ఐపీఎల్(IPL) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరపున ఆడుతున్నాడు. అయితే కేవలం క్రికెట్ వల్లే కాదు.. ధోనీకి ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో రిటైర్మెంట్ తీసుకున్నా సరే.. ధోనీ సంపద ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇటు బ్రాండ్ ఎండార్స్ మెంట్లు, అటు బిజినెస్(Business) లు ధోనీ ఆస్తుల విలువను పెంచుతున్నాయి. ధోని కూడా తగ్గేదే లే అన్నట్టుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.
ఇక, లేటెస్ట్ గా ఆదివారం ధోని 'మేడిన్ ఇండియా కెమెరా డ్రోన్ ' ను లాంచ్ చేశాడు. ఆ డ్రోన్ కు ద్రోణి అని పేరు పెట్టారు. ఈ డ్రోన్ ను గరుడ ఏరోస్పేస్ కంపెనీ తయారు చేసింది. ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ధోని పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ డ్రోన్ల కంపెనీకి ధోని బ్రాండ్ అంబాసిడర్ కూడా.
దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 26 నగరాల్లో 300 డ్రోన్లు, 500 మంది పైలెట్లు పనిచేస్తున్నారు. ఇక, ఈ ద్రోణి డ్రోన్ వ్యవసాయరంగంలో చాలా ఉపయోగపడనుంది. మందులు పిచికారీ చేయడం, సోలార్ ప్యానెల్ క్లీనింగ్ చేయడం, డెలివరీ సర్వీసులు, పైపిలైన్ ఇన్సెపెక్షన్స్, సర్వీయింగ్ వంటి రంగాల్లో ఉపయోగపడునుంది.
ఇక, ఈ ద్రోణి అనే డ్రోన్ తో మరో దాన్ని కూడా ధోని లాంచ్ చేశాడు. చెన్నై వేదికగా జరిగిన ఈ ఈవెంట్ 'కిసాన్ డ్రోన్' కూడా మహేంద్రుడు లాంచ్ చేశాడు. ఈ డ్రోన్ వ్యవసాయరంగంలో ఎంతగానో ఉపయోగపడనుంది. ఏఎన్ఐ రిపోర్ట్ ప్రకారం ఈ డ్రోన్ ఒక్కరోజులో ముప్పై ఎకరాల్లో మందులు పిచికారీ చేయగలదు.
ఈ ఈవెంట్ లో ధోని వ్యవసాయం పట్ల తనకున్నా ఆసక్తిని గుర్తు చేసుకున్నాడు. కోవిడ్ -19 సమయంలో వ్యవసాయరంగంలోకి మహేంద్రుడు దిగిన సంగతి తెలిసిందే. ఇక, ఈ డ్రోన్లు ఈ ఏడాది చివరికి మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్నాయని గరుడస్పేస్ సీఈవో అగ్నీశ్వర్ జయప్రకాష్ తెలిపారు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వత ధోని వ్యవసాయాధారిత, వస్త్ర, లిక్కర్, మోటార్ కార్ రంగాలలో విరివిగా పెట్టుబడులు పెడుతున్నాడు. ఝార్ఖండ్ లోని చిన్న పట్టణం రాంచీకి చెందిన ధోనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు.
స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్, ఖాతాబుక్, 7ఇంక్ బ్రూస్, కార్స్ 24, హోమ్ లోన్, స్పోర్ట్స్ ఫిట్, హోటల్ మహి రెసిడెన్సీ వంటి సంస్థలలో కూడా ఈ జార్ఖండ్ డైనమైట్ కు పెట్టుబడులున్నాయి. వీటితో పాటు పలు క్రీడలకు చెందిన లీగుల్లో కూడా ధోని పెట్టుబడులు పెట్టాడు. చెన్నయిన్ ఫుట్బాల్ క్లబ్, హాకీ క్లబ్ రాంచీ రేస్ , మాహీ రేసింగ్ టీమ్ ఇండియా వీటిలో కూడా మహేంద్రుడు పెట్టుబడులు పెట్టాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.