MADHAVAN SON TRAINING IN DUBAI FOR INTERNATIONAL SWIMMING COMPUTATIONS AIM OLYMPICS EVK
Madhavan's son: ఒలంపిక్స్ లక్ష్యం.. దుబాయ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రముఖ హీరో కొడుకు
వేదాంత్ మాధవన్ (ఫోటో క్రెడిట్- ట్విట్టర్)
Madhavan's son| మాధవన్ తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న నటుడు. ఆయనకంటు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన కొడుకు కెరీర్ (Career)ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు. అయితే చాలా మందిలా కాకుండా తన కొడుకును భిన్నంగా క్రీడల్లో (Sports) రాణించేదుకు ఆయన ప్రోత్సహిస్తున్నారు. కొడుకు కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొంటున్నాడు.
Madhavan's son: ఒలంపిక్స్ లక్ష్యం.. దుబాయ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రముఖ హీరో కొడుకుమాధవన్ (Madhavan) తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న నటుడు. ఆయనకంటు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆయన కొడుకు కెరీర్‌ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు. అయితే చాలా మందిలా కాకుండా తన కొడుకును భిన్నంగా క్రీడల్లో రాణించేదుకు ఆయన ప్రోత్సహిస్తున్నారు. కొడుకు కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొంటున్నాడు. మాధవన్ కుమారుడు వేదాంత్ కు చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ అంటే ఆసక్తి ఉండటంతో.. ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని, స్విమ్మింగ్ లో రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో వేదాంత్ ఏకంగా 7 పతకాలు సాధించి కొత్తరికార్డు సృష్టించాడు. త్వరలోనే తాను ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నాడు. వచ్చే ఒలింపిక్స్ (Olympics) లో స్విమ్మింగ్ లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాడు వేదాంత్. ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ గేమ్స్‌లో మంచి ఫలితాలు సాధించేందుకు సాధన చేస్తున్నాడు.
ట్రైనింగ్ కోసం దుబాయ్‌కి..
భారత్‌లో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ ఫూల్స్ లేకపోవడం వేదాంత్‌కి ట్రైనింగ్ సమస్యగా మారింది. ముంబైలో ఉండే పెద్ద పెద్ద స్విమ్మింగ్ ఫూల్స్ కూడా కరోనా కారణంగా మూతపడ్డాయి. దీంతో ఆలోచనలో పడ్డ మాధవన్ కొడుకు మంచి ట్రైనింగ్ ఇప్పించేందుకు బెస్ట్ స్విమ్మింగ్ పూల్‌ను ఎంచుకొన్నారు. ఈ నేపథ్యంలోనే మాధవన్ తన భార్య, కొడుకుతో కలిసి దుబాయ్ కి వెళ్లారు.
అక్కడ ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉండటంతో వేదాంత్ ట్రైనింగ్ తీసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని, అందుకే దుబాయ్ వచ్చినట్లు మాధవన్ తెలిపారు. తనకొడుకుని నటుడిగా చూడటం ఇష్టం లేదన్న మాధవన్.. వేదాంత్ ఏం చేయాలనుకుంటే దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేదాంత్ ప్రపంచ వ్యాప్తంగా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లలో పతకాలు గెలుస్తున్నాడని.. త్వరలో భారత్ తరపున ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని పతకం సాధిస్తాడని మాధవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత దేశానికి తొలి పతకాన్ని (First Medal) అందించిన మీరాబాయ్ చాను (Mirabai Chanu) గురించి మాధవన్ గతంలో భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఆర్థిక స్థితి చూసి చలించిపోయాడు. మీరాబాయ్ చాను పతకం గెలిచాక ఇంటికి వెళ్లిన నేలపై కూర్చొని అన్నం తింటున్న ఫొటోను ఒకరు ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ ఇల్లు కూడా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలిపేలా ఉంది. దీనిపై అప్పట్లో మాధవన్ ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మాధవన్.. ఇది నిజం కాదు కదూ.. నాకు నోట మాటలు రావడం లేదు.. అంటూ కామెంట్ చేశాడు. దేశానికే వన్నె తెచ్చిన చానూ కుటుంబ స్థితిని చూసి ఆతడు చాలా బాధపడ్డాడు. మాధవన్ లాగే ఎంతో మంది చాను ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.