హోమ్ /వార్తలు /క్రీడలు /

Sourav Ganguly Biopic : దాదా బయోపిక్ కు రంగం సిద్ధం.. హీరో, ప్రొడ్యూసర్ ఎవరంటే..!

Sourav Ganguly Biopic : దాదా బయోపిక్ కు రంగం సిద్ధం.. హీరో, ప్రొడ్యూసర్ ఎవరంటే..!

సౌరవ్ గంగూలీ (ఫైల్ ఫోటో)

సౌరవ్ గంగూలీ (ఫైల్ ఫోటో)

Sourav Ganguly Biopic : క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మూవీ .., మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు ‘దాదా’ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly Latest Telugu News) జీవితకథ (Biopic) ఆధారంగా రూపొందనున్న బయోపిక్ మూవీ.

ఇంకా చదవండి ...

క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మూవీ .., మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు ‘దాదా’ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly Latest Telugu News) జీవితకథ (Biopic) ఆధారంగా రూపొందనున్న బయోపిక్ మూవీ. తన బయోపిక్ మూవీ వస్తుందని కొన్నాళ్ల క్రితం ప్రకటించిన దాదా, తాజాగా ప్రొడ్యూసర్‌ను కూడా ప్రకటించాడు. లవ్ ఫిల్మ్స్ ( Luv Films ) ఈ మూవీని తెర‌కెక్కించ‌నుంది. మ‌హారాజ ఆఫ్ ఇండియ‌న్ క్రికెట్‌గా పేరుగాంచిన ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్ బ‌యోపిక్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గ‌తంలో త‌న బ‌యోపిక్‌కు దాదా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాను తామే నిర్మిస్తున్నట్లు ల‌వ్ ఫిల్మ్స్ గురువారం ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఇది త‌మ‌కు గొప్ప గౌర‌వ‌మ‌ని, గ్రేట్ ఇన్నింగ్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పింది. ఇక, దీనిపై సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు.

"క్రికెట్ నా జీవితం, అది నాకు జీవితంపై నమ్మకాన్ని, తలఎత్తి ముందుకు నడిచే ధైర్యాన్ని ఇచ్చింది. నా క్రికెట్ జర్నీ ఎంతో ఉత్సాహాంగా సాగింది... నా జీవితకథపై ఎల్‌యూవీ ఫిల్మ్స్ బయోపిక్ నిర్మిస్తుండడం థ్రిల్లింగ్‌గా ఉంది. " అంటూ ట్వీట్ చేశాడు సౌరవ్ గంగూలీ.

‘సూనూ కే టికు కీ స్వీటీ’, ‘దే దే ప్యార్ దే’, ‘జై మమ్మీ దీ’, ‘మలాంగ్’, ‘ఛలాంగ్’ వంటి సినిమాలు నిర్మించిన ఎల్‌యూవీ ఫిల్మ్... ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్‌లతో సినిమాలు నిర్మిస్తోంది. ఎట్టకేలకు తన బయోపిక్ రూపొందించడానికి అంగీకరించిన సౌరవ్ గంగూలీ... "అవును, నేను నా బయోపిక్‌కి అంగీకరించాను. అది బాలీవుడ్‌లో వస్తుంది. డైరెక్టర్ పేరు ఇప్పుడే చెప్పలేను. కొన్నిరోజుల్లో అన్ని వివరాలు బయటికి వస్తాయి... నా బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ అయితే బాగుంటాడని అనుకుంటున్నా" అంటూ తెలిపాడు.

మిగిలిన క్రికెటర్లతో పోలిస్తే భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ జీవితం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని భారత జట్టు అష్టకష్టాలు పడుతున్న సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు గంగూలీ. క్రికెటర్ల జీవితాలపై బాలీవుడ్‌లో బయోపిక్‌లు తెరకెక్కడం చాలా ఏళ్లుగా జరుగుతున్నదే. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ- ఎమ్మెస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ, సచిన్ టెండూల్కర్ - సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్, మహ్మద్ అజారుద్దీన్ - అజర్ బయోపిక్స్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టాయి.

ఇది కూడా చదవండి : టీమిండియాకి కరోనా సెగ.. మరో సభ్యుడికి పాజిటివ్.. ఐదో టెస్ట్ డౌటే..!

ఇక, మొట్టమొదటి వరల్డ్‌కప్ హీరో కపిల్‌దేవ్ బయోపిక్ - 83 త్వరలో రానుంది. తన చిన్ననాటి స్నేహితురాలు డోనాను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పాటు క్రికెట్‌ కెరీర్‌లో సౌరవ్ గంగూలీ సాధించిన అద్భుత విజయాల ఆధారంగా మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇక, నగ్మా ఎపిసోడ్ ను ఈ బయోపిక్ లో పెడతారా లేదా అన్నది వేచి చూడాలి.

First published:

Tags: Bcci, Bollywood news, Cricket, Ranbir Kapoor, Sourav Ganguly, Sports

ఉత్తమ కథలు