హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: మీ జట్లను వదిలి వచ్చేయండి.. ప్లేయర్లపై లక్నో జట్టు ఒత్తిడి? బీసీసీఐకి పిర్యాదు చేసిన రెండు ఫ్రాంచైజీలు

IPL 2022: మీ జట్లను వదిలి వచ్చేయండి.. ప్లేయర్లపై లక్నో జట్టు ఒత్తిడి? బీసీసీఐకి పిర్యాదు చేసిన రెండు ఫ్రాంచైజీలు

లక్నో యాజమాన్యంపై రెండు పాత ఫ్రాంచైజీల పిర్యాదు (PC: BCCI)

లక్నో యాజమాన్యంపై రెండు పాత ఫ్రాంచైజీల పిర్యాదు (PC: BCCI)

IPL 2022: కొత్తగా వచ్చిన లక్నో జట్టు యాజమాన్యం తమ ఆటగాళ్లను వెంటాడి.. ఒత్తిడికి గురి చేసి లాగేసుకోవాని చూస్తుందని రెండు జట్లు బీసీసీఐకి పిర్యాదు చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు ఈ పిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది.

ఇంకా చదవండి ...

ఐపీఎల్ 2022కి (IPL 2022) సంబంధించిన ప్లేయర్స్ రిటెన్షన్ (Player Retention) గడువు మరి కొన్ని గంటల్లో ముగుస్తుండటంతో అన్ని ఫ్రాంచైజీలు తుది జాబితాను తయారు చేసే పనిలో పడ్డాయి. తాము రిటైన్ చేసుకోవాలని భావిస్తున్న కొందరు ప్లేయర్లతో ఇప్పటికే పాత 8 జట్లు మంతనాలు సాగిస్తున్నాయి. అయితే ఐపీఎల్‌లోకి కొత్తగా భారీ ధరకు చెల్లించి ఎంటరైన లక్నో జట్టు (Lucknow Team) ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇతర జట్లలో ఉన్న స్టార్ ప్లేయర్లకు అత్యధిక ధరను ఆఫర్ చేస్తూ.. తమ వద్దకు వచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఏ పాత జట్టు అయినా ప్లేయర్‌ను రిటైన్ చేసుకున్నా.. తుది నిర్ణయం మాత్రం ఆటగాడిదే అవుతుంది. ఈ నియమాన్ని దృష్టిలో పెట్టుకొనే లక్నో జట్టు ఆటగాళ్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. తాము కోరుకున్న ప్లేయర్లను రిటైన్ లిస్టులో నుంచి తప్పిస్తే.. పాత జట్లు వారిని విడుదల చేయక తప్పదు. అప్పుడు ఫ్రీ పిక్‌లో వారిని కొనుగోలు చేయవచ్చని లక్నో భావిస్తున్నట్లు సమాచారం.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహల్ (KL Rahul) జట్టుతో కొనసాగనని ఇప్పటికే యాజమాన్యానికి చెప్పిన విషయం తెలిసిందే. రాహుల్‌ను కొనసాగించాలని భావించినా.. అతడు జట్టుతో ఉండటానికి ఇష్టపడటం లేదు. దీని వెనుక లక్నో యాజమాన్యం అయిన ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ ఉన్నట్లు పంజాబ్ భావిస్తున్నది. తమ కెప్టెన్ రాహుల్‌కు డబ్బు ఎర చూపి లాక్కోవలని చూస్తున్నట్లు ఆరోపిస్తున్నది. కీలకమై కెప్టెనే లేకుంటే ఇక తాము ఏ ఆటగాడిని రిటైన్ చేసుకోకూడదని కూడా పంజాబ్ అనుకుంటున్నది. మరోవైపు సన్ రైజర్స్ యాజమాన్యం కేన్ విలియమ్‌సన్‌తో పాటు రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకోవాలని అనుకున్నది. రషీద్ ఖాన్ (Rashid Khan) ప్రస్తుతం రూ. 9 కోట్ల జీతం అందుకుంటున్నాడు. అయితే అతడికి రూ. 12 కోట్ల జీతంతో రిటైన్ చేసుకుంటామని చెప్పింది. కానీ అందుకు రషీద్ ఒప్పుకోలేదు.

Shreyas Iyer: టీమ్ ఇండియా చరిత్రలో ఒకే ఒక్కడు.. టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన శ్రేయస్ అయ్యర్తనను మొదటి ప్లేయర్‌గా రిటైన్ చేసుకొని భారీ ధర చెల్లిస్తేనే జట్టుతో ఉంటానని చెబుతున్నాడు. ఆ విషయంపై చర్చలు జరుపుదామని అనుకున్నా.. రషీద్ మీనమేషాలు లెక్కిస్తున్నాడు. రషీద్‌ను లక్నో జట్టు యాజమాన్యం ప్రలోభాలకు గురి చేయడం వల్లే అతడు సన్‌రైజర్స్‌ను వదిలేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల యాజమాన్యాలు ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ పిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. లక్నో యాజమాన్యం తమ ఆటగాళ్లను వెంటాడి, వేటాడుతున్నదని.. ఇది అనైతికమని చెబుతూ రెండు జట్లు యాజమాన్యాలు బీసీసీఐకి పిర్యాదు చేశాయి. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగి దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తున్నది.

KS Bharat: 10 ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కేఎస్ భరత్


'మాకు రాతపూర్వకంగా ఎలాంటి పిర్యాదు అందలేదు. కానీ నోటి ద్వారా రెండు జట్లు కంప్లైట్ చేశాయి. లక్నో జట్టు ఉద్దేశపూర్వకంగా తమ ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసి వారిని అయోమయంలో పడేస్తున్నది. ప్రస్తుతానికి దీనిపై విచారణ చేస్తున్నాము. ఒక వేళ అది నిజమని చెబితే తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాము. జట్ల మధ్య సమతుల్యం దెబ్బతినకూడదలు. ఇలాంటి అన్యాయమైన పోటీ ఉండకూడది. ఇది సరైన మార్గం కాదు.' అని బీసీసీఐ అధికారి ఒకరు ఈ పిర్యాదుపై స్పందించారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Bcci, IPL 2022, KL Rahul, Punjab kings, Rashid Khan, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు