Rishabh Pant : కీలక సమయంలో రిషభ్ పంత్ (Rishabh Pant) తడబడ్డాడు. భవిష్యత్ టీమిండియా (Team India) కెప్టెన్ అంటూ పలువురు మాజీ క్రికెటర్లతో మన్నలను అందుకొంటున్న రిషభ్ పంత్.. డూ ఆర్ డై సమరంలో తన చెత్త కెప్టెన్సీతో మ్యాచ్ ను చేజార్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్ల మధ్య శనివారం వాంఖడే వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు విజయం సాధిస్తే చాలు.. అది నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఒక వేళ ముంబై ఇండియన్స్ గెలిస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers bangalore) ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. విజయం సాధించాాల్సిన చోట.. పటిష్ట స్థితిలో ఉన్నా కూడా చెత్త కెప్టెన్సీ, ఫీల్డింగ్ తో పంత్ ఢిల్లీని నాకౌట్ దశకు చేరకుండా చేశాడు.
టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చే వరకు కూడా మ్యాచ్ లో ఢిల్లీ జట్టే విజయం సాధించేలా కనిపించింది. టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చే సమయానికి ముంబై స్కోరు 3 వికెట్లకు 95 పరుగులు. 33 బంతుల్లో 65 పరుగులు సాధించాలి. పిచ్ స్లోగా ఉండటంతో బ్యాటింగ్ కష్టంగా ఉంది. శార్దుల్ ఠాకూర్ వేసిన 15వ ఓవర్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే టిమ్ డేవిడ్ బీట్ అయ్యాడు. బంతి బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్లింది. అంతేకాకుండా ఎడ్జ్ తీసుకున్న సౌండ్ కూడా వచ్చింది. కామెంట్రీ బాక్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది అవుటనే అనుకున్నారు. అయితే అంపైర్ అవుటివ్వలేదు. దాంతో పంత్ DRSకు వెళ్తారని అంతా అనుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ పంత్ దగ్గరకు వచ్చి తీసుకో తీసుకో అంటూ పదే పదే చెప్పాడు. అయితే పంత్ DRSకు వెళ్లలేదు. కాసేపటికి టీవీ రీప్లేలో అది క్లియర్ గా ఎడ్జ్ అయినట్లు తేలింది. గోల్డెన్ డక్ గా వెనుదిరగాల్సిన టిమ్ డేవిడ్ 11 బంతుల్లో 34 పరుగులు చేసి ముంబైని విజయానికి చేరువగా తెచ్చి పెవిలియన్ కు చేరాడు.
Taking DRS at crucial time is not everyone’s cup of tea.
Rishabh Pant😭.
TIM DAVID you Beauty😘
RCB RCB #RCB #MIvsDC #Playoffs #DCvsMI #IPL2022 pic.twitter.com/SOhCllnzUS
— Humza Sheikh (@Sheikhhumza49) May 21, 2022
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పంత్ తాను ఎందుకు DRS తీసుకోలేదో వివరించాడు. ’నాకు ఎడ్జ్ తీసుకున్నట్లు అనిపించింది. అయితే సర్కిల్ లో ఉన్న వారంతా కూడా అది ఎడ్జ్ కాదనే భావనలో ఉన్నారు. నేను వారిని DRSకు వెళ్తామా అని అడిగా.. కానీ చివరకు తీసుకోలేదు.‘ అంటూ వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కామెంటే పంత్ మీద మరింత కోపాన్ని తెచ్చేలా ఉంది. ఢిల్లీ జట్టుకు పంత్ కెప్టెన్ అదే సమయంలో కీపర్. ఎల్బీ లేదా కీపర్ క్యాచ్ ల విషయాల్లో కీపర్ కు మంచి అవకగాహన ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు DRSకు వెళ్లాలి ఎప్పుడు వద్దు అనేది వికెట్ కీపర్ కు తెలిసినంత క్లియర్ గా ఇంకెవరికి తెలిసే చాన్స్ ఉండదు. అయితే టిమ్ డేవిడ్ రివ్యూ విషయంలో పంత్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇక ఆ విషయాన్ని ఒప్పుకోకుండా.. సర్కిల్ లో ఉన్న వారు వద్దన్నారు. నేను వెళ్లలేదు అంటే ఎలా పంత్. అందులోనూ ఎడ్జ్ తీసుకుందన్న డౌట్ ఉందని తెలిసి కూడా. దీనిని బట్టి పంత్ కెప్టెన్ గా పనికిరాడని క్లియర్ గా అర్థం అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: David Warner, Delhi Capitals, Glenn Maxwell, IPL, IPL 2022, Jasprit Bumrah, Mumbai Indians, Prithvi shaw, Rishabh Pant, Rohit sharma, Royal Challengers Bangalore, Virat kohli