LPL: లంక ప్రీమియర్ లీగ్‌లో స్టార్ ఆటగాళ్లు వీళ్లే.. ఆఫ్రిది, పఠాన్ ఇంకా ఎవరున్నారంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో శ్రీలంక క్రికెట్ ప్లాన్ చేసిన లంక ప్రీమియమ్ లీగ్(Lanka Premier League) త్వరలోనే ప్రారంభం కానుంది.

news18-telugu
Updated: November 21, 2020, 5:04 PM IST
LPL: లంక ప్రీమియర్ లీగ్‌లో స్టార్ ఆటగాళ్లు వీళ్లే.. ఆఫ్రిది, పఠాన్ ఇంకా ఎవరున్నారంటే..
ఇర్ఫాన్ పఠాన్, షాహీద్ అఫ్రిది
  • Share this:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో శ్రీలంక క్రికెట్ ప్లాన్ చేసిన లంక ప్రీమియమ్ లీగ్(Lanka Premier League) త్వరలోనే ప్రారంభం కానుంది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ.. యూఏఈలో ఐపీఎల్ విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక కూడా ఎల్‌పీఎల్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ టోర్నీ ద్వారా దేశంలో క్రికెట్‌పై ఆధారపడినవారి జీవితాల్లో కరోనా లాక్‌డౌన్ తర్వాత తిరిగి వెలుగులు నింపుతామని టోర్ని నిర్వాహకులు వాగ్దానం చేశారు. యువ క్రికెటర్లు తమ సత్తాను నిరూపించుకోవడానికి ఇది ఒక వేదికగా నిలవనుందని తెలిపారు. ఇక, ఐపీఎల్‌ కంటే ముందే ఎల్‌పీఎల్ జరగాల్సి ఉండింది. అయితే శ్రీలంకలో కరోనా కేసులు పెరగడంతో టోర్నీ కాస్తా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 26న ఎల్‌పీఎల్‌ తొలి సీజన్‌ పోటీలు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది.

మహీందా రాజపక్స ఇంటర్నేషనల్ స్టేడియం‌ ఈ టోర్నికి సంబంధించిన మొత్తం మ్యాచ్‌లకు వేదికగా నిలవనుంది. ఈ టోర్నిలో మొత్తం ఐదు జట్లు పాల్గొననున్నాయి. కొలంబో కింగ్స్, క్యాండీ టస్కర్స్, జాఫ్నా స్టాలియన్స్, గాలే గ్లాడియేటర్స్, దంబుల్లా హాక్స్ టీమ్స్‌ టోర్నిలో పాల్గొంటాయి. అయితే కరోనా నేపథ్యంలో ఈ లీగ్‌ నుంచి క్రిస్‌ గేల్, లసిత్‌ మలింగ, సర్ఫరాజ్‌ అహ్మద్ వంటి కొందరు స్టార్ ఆటగాళ్లు వైదొలిగారు.

ఇక, ఈ టోర్నిలో పాల్గొనే స్టార్ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే..
షాహిద్ ఆఫ్రిది- లసిత్ మలింగ, గేల్ వంటి ఆటగాళ్లు తప్పుకోవడంతో ఈ టోర్నిలో అందరి కళ్లు అఫ్రిది పైనే ఉన్నాయి. అతడు గాలే గ్లాడియేటర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అనుభవం కలిగిన ఆటగాడు కావడంతో అతని ప్రదర్శనపై జట్టు విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ఇర్ఫాన్ పఠాన్- భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్ పఠాన్‌కు ఉన్న పేరు గురించి అందరికి తెలిసిందే. అయితే చాలా కాలంగా అతని ఆటని చూడని ప్రేక్షకులకు ఈ సీజన్ ద్వారా అతని బౌలింగ్ చూసే అవకాశం దక్కనుంది. తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ ఎలా ఇబ్బంది పెడతాడనేది చూడాల్సి ఉంది. అతడు క్యాండీ టస్కర్స్ టీమ్ మెంబర్‌గా ఉన్నాడు.

మథ్యూస్- కొలంబో కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న మథ్యూస్ ఆ జట్టును విజయ తీరాలకు చేరుస్తాడని అంతా భావిస్తున్నారు. కరోనా కారణంగా చాలా కాలం గ్రౌండ్‌కు దూరంగా ఉన్న మథ్యూస్.. ఈ టోర్నిలో ఏ విధంగా రాణిస్తాడో చూడాల్సి ఉంది.

కార్లోస్ బ్రాత్‌వైట్- అంతర్జాతీయ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన మాజీ వెస్టిండీస్ ఆటగాడు బ్రాత్‌వైట్ ఈ టోర్నిలో ఎలా రాణిస్తాడనేది చూడాల్సి ఉంది. దంబుల్లా హాక్స్ జట్టు ఆశలన్నీ బ్రాత్‌వైట్‌పైనే ఉన్నాయి.

షోయబ్ అక్తర్‌-జాఫ్నా స్టాలియన్స్ జట్టులో షోయబ్ అక్తర్ సభ్యుడిగా ఉన్నాడు. అతడికి ఉన్న సుదీర్ఘ అనుభవం ఆ జట్టు విజయాలకు సాయపడుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. బౌలింగ్ మాత్రమే కాకుండా అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడో, ఎలాంటి ప్రదర్శన ఇస్తాడనే ఆసక్తి నెలకొంది.
Published by: Sumanth Kanukula
First published: November 21, 2020, 5:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading