Home /News /sports /

LOVLINA MIRABAI CONCERNED ABOUT POSSIBLE EXCLUSION OF BOXING AND WEIGHTLIFTING JNK

Olympics: మీరాబాయి చాను, లవ్లీనా బోర్గహెయిన్‌లకు పెద్ద ఎదురు దెబ్బ.. రెండు క్రీడా ఈవెంట్లను తొలగించిన ఐవోసీ

లవ్లీనా, మీరాబాయిలకు పెద్ద షాకిచ్చిన ఐవోసీ

లవ్లీనా, మీరాబాయిలకు పెద్ద షాకిచ్చిన ఐవోసీ

Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన లవ్లీనా, మీరాబాయి చానులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) ఇండియాకు పతకాలు తెచ్చిన మీరాబాయి చాను (Mirabai Chanu), లవ్లీనా బోర్గహెయిన్‌కు (Lovlina Borgohain) పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ చాను రజత పతకం, లవ్లీనా బోర్గహెయిన్ బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించారు. రాబోయే పారిస్ ఒలింపిక్స్ 2024లో (Paris Olympics 2024) ఈ రెండు పతకాలను స్వర్ణ పతకాలుగా మారుస్తామని అప్పుడే ధీమా వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే వారి ఆశలు నెరవేరుతాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నది. మరో రెండున్నర ఏళ్లలో పారిస్ వేదికగా ఒలింపిక్స్ 2024 నిర్వహించాల్సి ఉన్నది. ఇప్పటికే ఏయే కేటగిరీలకు చెందిన క్రీడా ఈవెంట్లు ఉంటాయో ఐవోసీ నిర్ణయించింది. వీటిలో బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లను పక్కకు పెట్టింది. ఈ ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) చీఫ్‌కు కొన్ని ప్రత్యేకమైన అధికారాలను కట్టబెట్టారు. ఏదైనా క్రీడా సంఘాన్ని నిషేధించాలనే విషయలో ఐవోసీ సభ్యులు రెండుగా విడిపోయినా.. లేదా కమిటీ నిర్ణయాన్ని సదరు సంఘాలు వ్యతిరేకించినా.. చివరి నిర్ణయాన్ని ఐవోసీ చీఫ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ నిర్ణయమే ఈ రెండు క్రీడలకు అన్యాయం జరిగేలా చేస్తున్నది.

    అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబా), అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్)ల పరిపాలనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆ రెండు క్రీడా సంఘాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఐవోసీకి పిర్యాదులు అందాయి. ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించిన డోప్ టెస్టుల వ్యవహారంలో వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (వాడా) కొన్ని విషయాలను ఐవోసీ దృష్టికి తీసుకొని వెళ్లింది. క్రీడాకారులకు సంబంధించిన డోప్ టెస్టులను ఐబా, ఐడబ్ల్యూఎఫ్ సరైన సమయానికి అందించడం లేదని పేర్కొన్నది.

    Rohit Sharma : బీ అలర్ట్ సౌతాఫ్రికా.. హిట్ మ్యాన్ వచ్చేస్తున్నాడు.. వైరలవుతున్న వీడియో..




    అంతే కాకుండా ఈ రెండు సంఘాలలో సరైన గవర్నెన్స్ లేకపోవడానికి కూడా ఐవోసీ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లను పారిస్ ఒలింపిక్స్ జాబితా నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు రెండు మూడేళ్ల ముందు నుంచే శిక్షణ ప్రారంభిస్తారు. వారికి జాతీయ క్రీడా ఫెడరేషన్ల నుంచి నిధులు, ఇతర సౌకర్యాలు అందాలన్నా ఒలింపిక్స్ ఈవెంట్ల లిస్టులో వారికి సంబంధించిన క్రీడ ఉండాలి. కానీ ఇప్పుడు బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌ను పక్కన పెడుతూ ఐవోసీ చీఫ్ థామస్ బాచ్ నిర్ణయం తీసుకోవడం అథ్లెట్లు తీవ్ర నిరాశలో ఉన్నారు.

    Rohit Sharma : ఈ సవాళ్లను అధిగమిస్తే రోహిత్ శర్మ మేటి కెప్టెన్ గా నిలవడం ఖాయం..!


    పారిస్ 2024లో రెండు క్రీడా ఈవెంట్లపై ఐవోసీ త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ మరోసారి ఒలింపిక్స్‌లో ఉంటాయో లేదో అనే డైలమాకు ఐవోసీ తెరదించాల్సి ఉన్నది. కానీ నవంబర్ రెండవ వారంలో ఐవోసీ చీఫ్.. ప్రస్తుతం ఆ రెండు క్రీడా ఈవెంట్లను పెండింగ్‌లో పెడుతున్నామని.. త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. దీంతో ఒలింపిక్స్ 2028 స్పోర్ట్స్ ప్రోగ్రాం నుంచి కూడా ఈ రెండు క్రీడలను పక్కన పెడుతున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

    Virat - Rohit : రోహిత శర్మనే గోతులు తవ్వాడా..? కోహ్లీని నమ్మించి మోసం చేశాడా..?


    2028 ఒలింపిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక క్రీడా కార్యక్రమ జాబితాను విడుదల చేశారు. అయితే వాటిలో పెంటథ్లాన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌కు చోటు దక్కలేదు. ఈ విషయాన్ని ఐవోసీ గురువారం వెల్లడించింది. కొన్ని నిబంధనలను ఆ మూడు క్రీడా సంఘాలు పూర్తి చేయనందునే ప్రస్తుతతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది. అయితే ఐవోసీ పేర్కొన్న కొన్ని విషయాలను సరిదిద్దుకుంటే వచ్చే ఏడాది మరోసారి పరిశీలించి జాబితాలో చేర్చే విషయంలో నిర్ణయం తీసుకుంటామని థామస్ బాచ్ చెప్పారు. ఐవోసీ ప్రకటనతో మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గహెయిన్‌తో పాటు ఒలింపిక్స్ కోసం బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న పలువురు అథ్లెట్లకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: Boxing, Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు