LOS ANGELS OLYMPICS 2028 PRIMARY EVENTS LIST CRICKET HAS NO CHANCE IN PRIMARY LIST ICC IN DISCUSSIONS WITH IOC JNK
Cricket in Olympics: ఒలింపిక్స్ 2028 జాబితా నుంచి క్రికెట్ ఔట్.. నిరుత్సాహపడొద్దు.. క్రికెట్ ఎంట్రీ ఖాయం అంటున్న ఐసీసీ
లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కేనా?
Cricket in Olympics: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రాథమిక జాబితాలో క్రికెట్‌కు చోటు దక్కలేదు. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్ క్రీడల ప్రాథమిక జాబితాలో లేకపోయినా క్రికెట్‌ను చూడవచ్చని ఐసీసీ అంటున్నది. ఇప్పటికీ క్రికెట్ ఉంటుందనే ఆశలు అలాగే ఉన్నాయి. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఆధునిక పెంటాథ్లాన్ కూడా మొదటి జాబితాలో చేర్చలేదు.
2028లో లాస్ ఏంజిల్స్‌లో (Los Angels Olympics) జరగనున్న ఒలింపిక్స్‌లో (Olympics) అదనపు క్రీడగా క్రికెట్‌కు (Cricket) చోటు దక్కుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భావిస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ప్రాథమిక జాబితాలో క్రికెట్‌కు చోటు దక్కలేదు. జాబితాలో క్రికెట్ లేనప్పటికీ ఐసీసీ మాత్రం ఇంకా ఆశావాద దృక్పదంతోనే ఉన్నది. 2028 ఒలింపిక్స్ కోసం స్కేట్బోర్డింగ్, సర్ఫింగ్ మరియు స్పోర్ట్ క్లైంబింగ్‌తో సహా 28 క్రీడల ప్రాథమిక జాబితాను విడుదల చేసింది. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఆధునిక పెంటాథ్లాన్, క్రికెట్‌ను ఇందులో చేర్చలేదు. ఈ క్రీడలకు సంబంధించిన అంతర్జాతీయ సమాఖ్యలు ఒలింపిక్స్‌లో తమ స్థానాన్ని పొందేందుకు నిర్దిష్ట ప్రమాణాలను నెరవేర్చడానికి 2023 వరకు సమయం ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజింగ్‌లో జరిగే ఐవోసీ సమావేశంలో ఈ జాబితా ఆమోదం కోసం ఉంచుతారు. అదే చివరకు అధికారిక జాబితా అవుతుంది.
2028 ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెల్స్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ నగరం 2023 నుంచి అదనపు క్రీడలను ప్రతిపాదించవచ్చు. ఈ మార్గంలో క్రికెట్‌ను చేర్చాలని ఐసీసీ భావిస్తున్నది. బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, అమెరికన్ ఫుట్‌బాల్ లాగ ఉండే క్రికెట్‌కు తప్పకుండా అదనపు క్రీడల జాబితాలో చోటు దక్కుతుందని ఐసీసీ భావిస్తున్నది. ఆతిథ్య నగరం అదనపు క్రీడలను ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియ 2023లో ప్రారంభం అవుతుంది కాబట్టి తప్పకుండా క్రికెట్‌ను చేర్చడానికి ప్రయత్నిస్తామని ఐసీసీ బోర్డు సభ్యుడు ఒకరు చెప్పారు.
క్రికెట్‌ను అదనపు క్రీడగా చేర్చడం కష్టమని మాకు తెలుసు. చేర్చుతారనే గ్యారెంటీ కూడా లేదు. కానీ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు కొన్ని ఇతర క్రీడల నుంచి గట్టి పోటీ కూడా ఎదురవుతుంది. కానీ ఈ కఠిన సవాలును మేం స్వీకరించి ముందుకు వెళ్తాము. బీసీసీఐ కూడా మాకు మద్దతుగా ఉన్నది. కాబట్టి తప్పకుండా సాధిస్తామని అనుకుంటున్నట్లు సదరు అధికారి అన్నారు. ఐసీసీ ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన వర్క్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసింది.
'ఒలంపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలనే వాదనపై మేము అందరం ఒకే మాటపై ఉన్నాము. బీసీసీఐ సహా పలు క్రికెట్ బోర్డులు ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నాయి. అదనపు క్రీడగా చేర్చి తప్పకుండా లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించేలా చర్యలు తీసుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ మంది కంటే ఎక్కువ క్రికెట్‌ను చూస్తారు. వారందరూ ఈ క్రీడ ఒలింపిక్స్‌లో చేర్చాలని కోరుకుంటున్నారు' అని ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లీ అన్నారు.
మరోవైపు లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ ప్రాథమిక జాబితా నుంచి వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ క్రీడలను కూడా తొలగించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఈ రెండు క్రీడల్లో పతకాలు లభించాయి. మీరాబాయి చాను, లవ్లీనా బోర్గహెయిన్ తమ క్రీడలను ఒలింపిక్స్ ప్రాథమిక జాబితాలో చేర్చకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.