• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • LOCKDOWN IS BLESSING TO IPL SOURAV GANGULY COMMENTS ON CURFEW JNK

IPL 2021 : ఐపీఎల్‌కు కరోనా కర్ఫ్యూ కలిసొచ్చింది.. లాక్‌డౌన్‌పై బీసీసీఐ చీఫ్ గంగూలీ ఏం చెప్పారంటే..!

IPL 2021 : ఐపీఎల్‌కు కరోనా కర్ఫ్యూ కలిసొచ్చింది.. లాక్‌డౌన్‌పై బీసీసీఐ చీఫ్ గంగూలీ ఏం చెప్పారంటే..!

కరోనా వల్ల ఐపీఎల్‌కు కలిసొచ్చిందంటున్న సౌరవ్ గంగూలీ [PC: BCCI]

  • Share this:
    కరోనా లాక్‌డౌన్ (Corona Lockdown), మహారాష్ట్రలో కర్ఫ్యూ (Curfew) నేపథ్యంలో ఐపీఎల్ (IPL 2021) తొలి విడత మ్యాచ్‌లు వాంఖడేలో జరుగుతాయో లేదో అనే అనుమానాల నేపథ్యంలో రెండు మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం ముంబైలో మరో ఎనిమిది మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూను కూడా మరింత కఠినంగా అమలు చేస్తున్నది. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లు ముంబై నుంచి తరలిస్తారనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) క్లారిటీ ఇచ్చారు. కరోనా లాక్‌డౌన్, కర్ఫ్యూ వల్ల ఐపీఎల్‌కు కలిసొచ్చిందని అన్నారు. 'ప్రస్తుతం మ్యాచ్‌లన్నీ బయోబబుల్ వాతావరణంలో ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహిస్తున్నాము. రాత్రి 8.00 గంటల తర్వాత కర్ఫ్యూ ఉండటంతో స్టేడియం చుట్టుపక్కల క్రికెట్ అభిమానులు గుమికూడకుండా ఇళ్లలో కూర్చొని టీవీల్లో మ్యాచ్‌లు వీక్షిస్తున్నారు. కర్ఫ్యూ లేకపోయుంటే వాంఖడే బయట అభిమానుల కోలాహలం ఉండేది. వారిని అదుపు చేయడం కష్టంగా మారేది. ఐపీఎల్‌కు కూడా చెడ్డపేరు వచ్చేది. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి లేదు' అని గంగూలీ చెప్పుకొచ్చారు.

    'ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఉన్నాము. కోవిడ్-19 ఆంక్షలను పూర్తిగా పాటిస్తూ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నాము. ముంబై నుంచే కాదు మరే వేదిక నుంచి మ్యాచ్‌లను తరలించే ఆలోచన లేదు. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాయి. రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు మాకు పూర్తిగా కలసి వచ్చాయి. అవి మాకు వరాలు అనే చెప్పుకోవాలి. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది' అని సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు.

    ఇండియా-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ పూణేలో నిర్వహించిన సమయంలో అక్కడ కర్ఫ్యూ లేదు. కానీ కరోనా కారణంగా ప్రేక్షకులను అనుమతించకుండానే మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహించారు. దీంతో అభిమానులు దగ్గరలోని కొండపైకి భారీగా చేరుకొని స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ను చూశారు. వారిని అదుపు చేసే పరిస్థితులు కూడా లేవు. పైగా ఆటగాళ్లు స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్లే సమయంలో అభిమానులు వారిని ఫాలో అయ్యే వారు. ఒకవేళ కర్ఫ్యూ లేకుంటే ముంబైలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురై ఉండేదని బీసీసీఐ అంటున్నది. గంగూలీ కూడా ఈ నేపథ్యంలోనే కరోనా కర్ఫ్యూ మాకు వరమయ్యిందని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా రాత్రి కర్ఫ్యూ వల్ల అందరూ ఇళ్లలోనే ఉంటుండటంతో టీవీలో ఐపీఎల్ చూసే వాళ్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ప్రధాన టోర్నీలు ఏవీ జరగకపోవడంతో అందరూ ఐపీఎల్‌కే ఆసక్తి చూపిస్తున్నారు.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు