గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత.. చిచ్చు పెట్టిన జనసేన పాటలు

పోలీసులు, గ్రామస్తుల వాగ్వాదం

స్థానికులు ఎదురు తిరిగి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో దుర్గి ఎస్‌ఐ రామాంజనేయులు, హోంగార్డ్స్ రంగా, పిచ్చయ్యకు గాయాలయ్యాయి. మరికొందరు పోలీసుల వాహనాలను ధ్వంసం చేసి టైర్లలో గాలి తీశారు.

  • Share this:
    ఆదివారం రాత్రి గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, స్థానికుల ఘర్షణ చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతో వారిపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. ANI వార్తా సంస్థ కథనం ప్రకారం.. శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి తిరునాళ్లలో కొందరు జనసేన కార్యకర్తలు కొణిదెల కొదమ సింహాల పేరుతో సోషల్ ప్లే ఈవెంట్ నిర్వహించారు. అందులో జనసేనకు సంబంధించిన పాటలు మోగించారు. జనసేన జెండా కూడా ఎగరవేశారు. దానిపై ఇతర పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐనా జనసేన నేతలు మాత్రం అలాగే కొనసాగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

    పోలీసులు రంగం ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఐతే స్థానికులు ఎదురు తిరిగి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో దుర్గి ఎస్‌ఐ రామాంజనేయులు, హోంగార్డ్స్ రంగా, పిచ్చయ్యకు గాయాలయ్యాయి. మరికొందరు ఆందోళనకారులు పోలీసుల వాహనాలను ధ్వంసం చేసి టైర్లలో గాలి తీశారు. పోలీసులపై రాళ్లు విసిరిన పలువురిని అదుపులోకి తీసుకొని జీపులో తరలిస్తుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి తమవాళ్లను విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావు సీరియస్ అయ్యారు. ఈ అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: