హోమ్ /వార్తలు /క్రీడలు /

LLC 2022 : గ్రౌండ్ లో బాహాబాహీకి దిగిన యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్.. ఒకర్ని ఒకరు తోసుకుంటూ..

LLC 2022 : గ్రౌండ్ లో బాహాబాహీకి దిగిన యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్.. ఒకర్ని ఒకరు తోసుకుంటూ..

PC : TWITTER

PC : TWITTER

LLC 2022 : లెజెండ్స్ లీగ్ క్రికెట్ (Legends League Cricket) 2022 ఆటగాళ్ల మధ్య భారీ గొడవకు కారణమైంది. జోధ్ పూర్ వేదికగా బిల్వారా కింగ్స్ (Bilwara kings), ఇండియా క్యాపిటల్స్ (India Capitals) మధ్య అక్టోబర్ 2న మ్యాచ్ జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

LLC 2022 : లెజెండ్స్ లీగ్ క్రికెట్ (Legends League Cricket) 2022 ఆటగాళ్ల మధ్య భారీ గొడవకు కారణమైంది. జోధ్ పూర్ వేదికగా బిల్వారా కింగ్స్ (Bilwara kings), ఇండియా క్యాపిటల్స్ (India Capitals) మధ్య అక్టోబర్ 2న మ్యాచ్ జరిగింది. ఈ క్వాలిఫయర్ మ్యాచ్ లో బిల్వారా కింగ్స్ బ్యాటర్ యూసఫ్ ఫఠాన్, ఇండియా క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ జాన్సన్ లు దాాదాపుగా కొట్టుకునేంత పనిచేశారు. వివరాల్లోకి వెళితే.. నాలుగు జట్లతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జరగుతుంది. ఇండియా క్యాపిటల్స్, మనిపాల్ టైగర్స్, బిల్వార కింగ్స్, గుజరాత్ జెయింట్స్ జట్లతో ఈ టోర్నీ జరగుతుంది. ఈ క్రమంలో లీగ్ దశ ముగిసిన తర్వాత మూడు జట్లు నాకౌట్ దశకు అర్హత సాధించాయి. ఇండియా క్యాపిటల్స్, బిల్వార కింగ్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు నాకౌట్ దశకు చేరుకున్నాయి.

ఈ క్రమంలో అక్టోబర్ 2న ఇండియా క్యాపిటల్స్, బిల్వార కింగ్స్ జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. జాన్సన్ బౌలింగ్ లో యూసఫ్ ఫఠాన్ బౌండరీలు బాదాడు. ఇక ఓవర్ పూర్తయ్యాక వెళ్తూ వెళ్తూ జాన్సన్ యూసఫ్ పఠాన్ పై నోరు పారేసుకున్నాడు. యూసఫ్ ఫఠాన్ కూడా జాన్స్ వద్దకు దూసుకెళ్లాడు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షన వాతావరణం నెలకొంది. ఒకానొక సమయంలో యూసఫ్ పఠాన్ ను జాన్సన్ తోసేశాడు కూడా. వెంటనే అంపైర్ యూసఫ్ పఠాన్ ను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో కొట్టుకునే పరిస్థితులు తప్పిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బిల్వారా కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 226 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (65), విలియమ్స్ పోర్ట్ ఫీల్డ్ (59) అర్ధ శతకాలు బాదారు. యూసఫ్ పఠాన్ (48) దూకుడుగా ఆడాడు. అయితే గొడవ పడ్డ మిచెల్ జాన్సన్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. చివర్లో రాజేశ్ బిష్ణోయ్ 11 బంతుల్లోనే 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంతరం ఛేదనలో ఇండియా క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో6 వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసి నెగ్గింది. రాస్ టేలర్ (84) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. యాష్లే నర్స్ 28 బంతుల్లో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో లియాం ప్లంకెట్ 9 బంతుల్లో 20 నాటౌట్ కూడా భారీ షాట్లు ఆడటంతో ఇండియా క్యాపిటల్స్  మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో ఇండియా క్యాపిటల్స్ ఫైనల్ కు చేరుకుంది. అక్టోబర్ 3న జరిగే ఎలిమినేటర్ పోరులో గుజరాత్ జెయింట్స్ తో బిల్వార కింగ్స్ తలపడనుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cricket, Cricket news, Fighting, Team India

ఉత్తమ కథలు