నెరవేరిన 30 ఏళ్ల కల

Rekulapally Saichand
Updated: June 26, 2020, 10:55 AM IST
నెరవేరిన 30 ఏళ్ల కల
(Getty Images)
  • Share this:
ప్రపంచంలో అత్యధిక ప్రేక్షకాదరణ కలిగిన ఆట పుట్ బాల్. అధికార లిగ్‌లో పాటు,ప్రవైట్ లిగ్‌లతో నిత్యం అభిమానులను అలరిస్తునే ఉంటుంది.
ముఖ్యంగా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ కలిగి టోర్ని, తాజాగా ఈ లీగ్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. 30 ఏళ్లుగా టైటిల్‌ను గెలవాలనే లివర్‌పూల్‌ జట్టు కల సాకారమైంది. గురువారం రాత్రి మాంచెస్టర్‌,చెల్సియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెల్సియా జట్టు 2-1 తేడాతో విజయం సాధించడంతో లివర్‌పూల్‌ ‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది.

అయితే ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్‌ గనుక చెల్సియాపై విజయం సాధించి ఉంటే లివర్‌పూల్‌ టైటిల్‌ గెలవడానికి మరో మ్యాచ్‌కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో చెల్సియా జట్టులోని క్రిస్టియన్‌ పులిసిక్‌, విలియమ్‌ సీల్డ్‌ ఆఖరి నిమిషంలో గోల్స్‌ చేయడంతో చెల్సియా జట్టు 2-1 విజయం సాధించింది.

టైటిల్ గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా లివర్‌పూల్‌ అభిమానులు ఆనందగా ఉన్నారు. 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత టైటిల్ గెలవాలనే కల నేరవేరినందుకు లివర్‌పూల్‌ క్లబ్‌ ఆటగాళ్ళు సంతోషంతో ఉబ్బితబ్బిపోయారు.
First published: June 26, 2020, 10:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading