Home /News /sports /

KKR vs RR: రాజస్థాన్ సూపర్ బౌలింగ్.. కేకేఆర్ స్కోర్ ఎంతంటే!

KKR vs RR: రాజస్థాన్ సూపర్ బౌలింగ్.. కేకేఆర్ స్కోర్ ఎంతంటే!

Rajasthan Royals

Rajasthan Royals

ఐపీఎల్ 2021లో వాంఖేడే స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్ కోల్‌కతా స్వల్ఫ స్కోర్‌కే పరిమితమైంది

    ఐపీఎల్ 2021లో వాంఖేడే స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్ కోల్‌కతా స్వల్ఫ స్కోర్‌కే పరిమితమైంది.  రాజస్థాన్ ముందు 134 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. నిర్ణత 20 ఓవర్లో 133 పరుగుల సాధించింది. ముందుగా టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. ఓపెనర్స్ బరిలోకి దిగిన నితీశ్‌ రాణా,శుభ్‌మన్‌ గిల్ కోల్‌కతాకు మంచి అరంభాన్ని ఇవ్వలేకపోయారు. శుభ్‌మన్‌గిల్‌(11) రనౌట్ కాగా.. నితీశ్‌ రాణా(22) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఉనద్కత్‌ వేసిన 10 ఓవర్‌లో సునీల్‌ నరైన్‌(6) ఔటయ్యాడు. ఐదో బంతికి భారీ షాట్‌ ఆడబోయి జైశ్వాల్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రిస్‌మోరిస్‌ వేసిన 11 ఓవర్‌లో మోర్గాన్‌ అనూహ్యంగా డకౌటయ్యాడు. దాంతో కోల్‌కతా 62 పరుగులకే నాలుగు వికెట్ల్ కోల్పోయింది. ఆ తర్వాత దినేశ్‌ కార్తీక్‌,రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్ళారు.త్రిపాఠి(36) దాటిగా ఆడే క్రమంలో రియాన్ పరాగ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత దినేశ్‌ కార్తీక్‌(25),ఆండ్రూ రసెల్(9) కూడా ఔటవ్వడంతో కోల్‌కతా అనుకున్నంత స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయింది. చివరకు 133 పరుగుల వరకు పరిమితమైంది.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: IPL 2021, Kolkata Knight Riders, Rajasthan Royals

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు