Ind vs Aus: ఫైనల్ ఫైట్‌‌లో ఆసీస్ భారీ స్కోరు... భారత టార్గెట్ 273... బ్యాట్స్‌మెన్‌పైనే భారం...

India vs Australia, 5th ODI at Delhi: ఉస్మాన్ ఖవాజా సెంచరీ... హ్యాండ్స్‌కోంబ్ హాఫ్ సెంచరీ... భువనేశ్వర్ కుమార్‌కు మూడు వికెట్లు, జడేజా, షమీలకు రెండేసి వికెట్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 13, 2019, 5:15 PM IST
Ind vs Aus: ఫైనల్ ఫైట్‌‌లో ఆసీస్ భారీ స్కోరు... భారత టార్గెట్ 273... బ్యాట్స్‌మెన్‌పైనే భారం...
క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీకి శిఖర్ ధావన్ అభినందన
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 13, 2019, 5:15 PM IST
Ind vs Aus: వన్డే సిరీస్‌ టైటిల్ విజేతను నిర్ణయించే ఢిల్లీ వన్డేలో ఆసీస్ మంచి గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఉస్మాన్ ఖవాజా సెంచరీ, హ్యాండ్స్‌కోంబ్ హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది ఆసీస్. 273 పెద్ద లక్ష్యమేమీ కాకపోయినా బౌలింగ్‌కు సహకరించే ఫిరోజ్ షా కోట్లా పిచ్ మీద ఈ లక్ష్యాన్ని చేధించడమంటే సవాల్‌తో కూడుకున్న పనే. భారత బ్యాట్స్‌మెన్ ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం, సిరీస్ ఫలితం ఆధారపడి ఉన్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం దక్కింది. మొదటి వికెట్‌కు మరో సారి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా. 14.3 ఓవర్లలో 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 27 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా వన్డేల్లో రెండో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఖవాజాకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. హ్యాండ్స్‌కోంబ్‌తో కలిసి రెండో వికెట్‌కు 99 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు ఖవాజా. 102 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తిచేసుకున్నాడు ఖవాజా. సెంచరీ పూర్తయిన తర్వాత భువనేశ్వర్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఖవాజా. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ మూడో బంతికే జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత 60 బంతుల్లో 4 ఫోర్లతో 52 పరుగులు చేసిన హ్యాండ్‌కోంబ్ కూడా షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో నాలుగో మ్యాచ్‌లో ఫలితాన్ని టర్న్ చేసిన టర్నర్... 20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు,
ind vs aus, Ind vs aus Odi series, Ashton Turner, Ind vs aus 5th Odi, big finale ind vs aus, Aus vs Ind delhi One day match, Usman khawaja 2nd Century, Handscomb, Aaron Finch, Virat Kohli, Rohit Sharma, Shikhar Dhawan, Feroz Shah Kotla Cricket Stadium Delhi, ఫిరోజ్ షా క్రికెట్ స్టేడియం ఢిల్లీ, ఇండియా vs ఆస్ట్రేలియా, భారత్ vs ఆసీస్ 5వ వన్డే, వన్డే సిరీస్ ఇండియా vs ఆస్ట్రేలియా, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్
ఉస్మాన్ ఖవాజా సెంచరీ అభివాదం

ఆ తర్వాత స్టెయినిస్, అలెక్స్ క్యారే కలిసి నెమ్మదిగా ఆడుతూ పరుగులు సాధించారు. ఈ దశలో భువీ బౌలింగ్‌లో 20 పరుగులు చేసిన స్టెయినిస్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపటికే 9 బంతుల్లో 3 పరుగులు చేసిన ఆలెక్స్ క్యారే కూడా కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది, జట్టు స్కోరు 250 దాటించాడు రిచర్డ్‌సన్. బుమ్రా బౌలింగ్‌లో ఏకంగా 19 పరుగులు సాధించారు కమ్మిన్స్, రిచర్డ్‌సన్. అప్పటిదాకా 8 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా... ఈ ఓవర్లో ఏకంగా 19 పరుగులు సమర్పించడం విశేషం. 16 బంతుల్లో 34 పరుగులు సాధించిన ఈ జోడిని భువనేశ్వర్ విడదీశాడు. 15 పరుగులు చేసిన కమ్మిన్స్, భువీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 21 బంతుల్లో 29 పరుగులు చేసిన రిచర్డ్‌సన్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు.

ind vs aus, Ind vs aus Odi series, Ashton Turner, Ind vs aus 5th Odi, big finale ind vs aus, Aus vs Ind delhi One day match, Usman khawaja 2nd Century, Handscomb, Aaron Finch, Virat Kohli, Rohit Sharma, Shikhar Dhawan, Feroz Shah Kotla Cricket Stadium Delhi, ఫిరోజ్ షా క్రికెట్ స్టేడియం ఢిల్లీ, ఇండియా vs ఆస్ట్రేలియా, భారత్ vs ఆసీస్ 5వ వన్డే, వన్డే సిరీస్ ఇండియా vs ఆస్ట్రేలియా, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కుల్దీప్ యాదవ్
భువనేశ్వర్ కుమార్‌కు సహచరుల అభినందన...

భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా... రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు తలా రెండేసి వికెట్లు దక్కగా...కుల్దీప్ యాదవ్‌కు ఒక్క వికెట్ దక్కింది. కుల్దీప్ యాదవ్‌ 10 ఓవర్లలో ఏకంగా 74 పరుగులు సమర్పించడం విశేషం.

First published: March 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...