Worldcup 2019: సఫారీలకు షాక్ ఇచ్చిన బంగ్లా... దక్షిణాఫ్రికా ముందు రికార్డు టార్గెట్...

Ban vs SA: ముస్ఫికర్ రహీమ్,షకీబ్ ఉల్ హసన్‌ హాఫ్ సెంచరీలు... ఇద్దరి మధ్య మూడో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యం... 46 పరుగులు చేసిన మొహ్మద్దుల్లా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: June 2, 2019, 6:59 PM IST
Worldcup 2019: సఫారీలకు షాక్ ఇచ్చిన బంగ్లా... దక్షిణాఫ్రికా ముందు రికార్డు టార్గెట్...
షకీబ్ ఉల్ హసన్ బ్యాటింగ్ (Photo by Ian KINGTON / AFP)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: June 2, 2019, 6:59 PM IST
Live Cricket Score, Bangladesh vs South Africa, ICC World Cup 2019 Match at Oval: వరల్డ్‌కప్‌లో భాగంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఆరంభం నుంచి ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 8.2 ఓవర్లలోనే 60 పరుగులు సాధించింది బంగ్లా జట్టు. అయితే ఈ దశలో 16 పరుగులు చేసిన తమీమ్ ఇక్బాల్‌ను అవుట్ చేసిన ఫెల్కుక్వాయో... సఫారీలకు తొలి బ్రేక్ అందించాడు. ఆ తర్వాత 30 బంతుల్లో 9 ఫోర్లతో 42 పరుగులు చేసిన సౌమ్యా సర్కార్... క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ముస్ఫికర్ రహీమ్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు షకీబ్ ఉల్ హసన్. ఇద్దరూ నిలకడగా ఆడుతూ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ... స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత షకీబ్ ఉల్ హసన్ అవుట్ అయ్యాడు. 84 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్స్‌తో 75 పరుగులు చేసిన షకీబ్ ఉల్ హసన్‌ను ఇమ్రాన్ తాహీర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 21 పరుగులు చేసిన మహ్మద్ మిథున్ కూడా తాహీర్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. 80 బంతుల్లో 8 ఫోర్లతో 78 పరుగులు చేసిన ముస్ఫికర్ రహీమ్... జట్టు 250 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మొహ్మద్దుల్లా, మొసాడిక్ హుస్సేన్ కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించిన తర్వాత 26 పరుగులు చేసిన హుస్సేన్ అవుట్ అయ్యాడు. అయితే చివరి ఓవర్లో మొహ్మద్దుల్లా, మెహిడీ హసన్ 14 పరుగులు రాబట్టడంతో బంగ్లా భారీ స్కోరు సాధించింది. మొహ్మద్దుల్లా 33 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

సౌతాఫ్రికా స్టార్ బౌలర్ ఇంగిడి గాయం కారణంగా నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి పెవిలియన చేరడం ఆ జట్టును బాగా ప్రభావితం చేసింది. ఫెల్కుక్వాయో, ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరిస్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.



First published: June 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...