• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • LITTLE PANDYA ON MOVE MI RELEASED VIDEO HARDIK AND NATASHA ENJOYING WITH KID JNK

Hardik Pandya : బుజ్జి పాండ్యా చిన్ని చిన్ని అడుగులు.. మురిసి పోతున్న హార్దిక్, నటాషా

పాండ్యా కొడుకు ఎలా నడుస్తున్నాడో చూశారా? (PC: Twitter)

తల్లిదండ్రులకు వారి చిన్నారి బిడ్డలు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు కలిగే ఆనందమే వేరు. ఇప్పుడు టీమ్ ఇండియా ఆల్ రౌండర్ కూడా తన కుమారుడు అగస్త్య నడకను చూసి గాల్లో తేలిపోతున్నాడు.

  • Share this:
    టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ప్రస్తుతం ముంబైలోని తన ఇంట్లో సేదదీరుతున్నాడు. ఐపీఎల్ 2021 (IPL 2021) అర్దాంతరంగా వాయిదా పడటంతో ముంబై ఇండియన్స్‌కు (Mumbai Indians) ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా ఇంట్లోనే కుటుంబంతో గడుపుతున్నాడు. గత ఏడాది సెర్బియాకు చెందిన నటి నటాషా స్టాన్‌కోవిచ్‌‌ను హార్దిక్ పాండ్యా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి నాటికే గర్భవతి అయిన నటాష.. జులైలో కుమారుడికి జన్మినిచ్చింది. వారి కుమారుడికి పాండ్యా దంపతులు అగస్త్య (Agasthya Pandya) అని పేరు పెట్టారు. కుమారుడు పుట్టిన తర్వాత గత ఏడాది యూఏఈలో ఐపీఎల్ ఆడటానికి వెళ్లాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్నాడు. దీంతో కుమారుడితో సరైన సమయాన్ని గడపలేక పోయాడు. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కుమారుడితో కొంత సమయం గడిపినా.. మళ్లీ ఇంగ్లాండ్ సిరీస్, ఐపీఎల్ 2021తో కుటుంబానికి దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ వాయిదా పడటం.. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు ఎంపిక కాకపోవడంతో హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. అదే సమయంలో కొడుకు అగస్త్య పాండ్యాతో ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

    అగస్త్య పాండ్యా ఇప్పుడు బుడిబుడి అడుగులు వేస్తూ ఇంట్లో సందడి చేస్తున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్‌కోవిచ్‌ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇంట్లో వారిద్దరూ తమ కుమారుడితో ఆడుకుంటున్న వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. పాండ్యా దంపతులు అగస్త్య పడిపోకుండా పట్టుకోవడం.. చిన్ని చిన్ని అడుగులేస్తూ అమ్మ దగ్గరకు పోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ అందమైన వీడియోను మాత్రం ముంబై ఇండియన్స్ జట్టు పోస్టు చేయడం విశేషం. నెట్టింట సందడిగా మారిన ఈ వీడియోను చూసి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.





    కాగా, టెస్టు జట్టులో చోటు కోల్పోయిన హార్దిక్ పాండ్యా ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం అవుతాడనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అతడు ఆల్‌రౌండర్‌గా నిరూపించుకుంటే తిరిగి టెస్టు జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు జులైలో టీమ్ ఇండియా శ్రీలంకలో పర్యటించాల్సి ఉన్నది. కీలక ప్లేయర్లు ఇంగ్లాండ్‌లో ఉంటుండటంతో.. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులను పంపాలని భావిస్తున్నారు. ఈ జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు లభించే అవకాశం ఉన్నది. టీమ్ ఇండియా జులై శ్రీలంక వెళ్లి 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్నది.
    Published by:John Naveen Kora
    First published: