BCCI చీఫ్ సెలక్టర్ వేట షురూ..రేసులో అగార్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్...

ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్‌ ఖోడాల పదవీ కాలం ముగిసంది. దీంతో బీసీసీఐ సెలక్టర్ల ఎంపిక బాధ్యతను మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో కూడిన సీఏసీకి అప్పగించింది.

news18-telugu
Updated: February 18, 2020, 11:13 PM IST
BCCI చీఫ్ సెలక్టర్ వేట షురూ..రేసులో అగార్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్...
బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సౌరవ్ గంగూలీ (Image:BCCI/Twitter)
  • Share this:
టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్ వేట మొదలైంది. ఇప్పటికే చీఫ్ సెలక్టర్ గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్‌ ఖోడాల పదవీ కాలం ముగిసంది. దీంతో బీసీసీఐ సెలక్టర్ల ఎంపిక బాధ్యతను మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో కూడిన సీఏసీకి అప్పగించింది. అయితే, కొత్త సెలక్టర్ల ఎంపికకు నిర్దిష్టమైన సమయం ఏదీ లేదు. అయితే వచ్చే నెల మొదటివారంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మదన్‌లాల్ తెలిపారు. అయితే, సెలక్షన్ ప్రాసెస్ మొదలై పోగా చివరి దశ ఇంటర్వ్యూలకు మాత్రం నలుగురు మిగిలారు. ఫైనల్‌గా మాజీ లెగ్‌స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మాజీ పేసర్ అజిత్ అగార్కర్, మరో మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్‌లు చీఫ్ సెలక్టర్ రేసులో ఉన్నారు. వీరిలో కూడా లక్ష్మణ్ శివరామకృష్ణన్, అజిత్ అగార్కర్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని సమాచారం.
First published: February 18, 2020, 11:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading