Home /News /sports /

LIONEL MESSI SAYS GOOD BYE TO FC BARCELONA FANS IN SHOCK MOOD MESSI TO JOIN IN NEW CLUB FOR FORTH COMING SEASON JNK

Lionel Messi: ఒక అధ్యాయం ముగిసింది.. బార్సిలోనాకు లియోనల్ మెస్సీ గుడ్ బై.. బాధలో ఫ్యాన్స్

మెస్సీ షాకింగ్ నిర్ణయం.. బార్సిలోనా క్లబ్‌కు గుడ్‌బై (PC: WeAreMessi/Twitter)

మెస్సీ షాకింగ్ నిర్ణయం.. బార్సిలోనా క్లబ్‌కు గుడ్‌బై (PC: WeAreMessi/Twitter)

బార్సిలోనా క్లబ్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఆ క్లబ్‌కు గుడ్‌బై చెప్పాడు. క్లబ్ యాజమాన్యంతో విభేదాలు, స్పానిస్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్‌లో మార్పుల కారణంగా జట్టుతో కొనసాగలేనని మెస్సీ తేల్చి చెప్పాడు.

ఇంకా చదవండి ...
  జార్జ్.. ఇటలీ-స్పానిష్ మూలాలు ఉన్న అర్జెంటీనా వాసి. ఎన్నో ఏళ్ల క్రితమే తాత ముత్తాతలు ఇటలీ నుంచి అర్జెంటీనా వలస రావడంతో.. అక్కడే స్థిరపడి ఒక స్టీల్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య సెలియా కస్సిటినీ ఒక అయస్కాంతం తయరీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నది. వారికి ముగ్గురు సంతానం. ఆ ముగ్గురిలో చిన్నవాడే లియోనల్ మెస్సీ. చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ అంటే మెస్సీకి చాలా ఇష్టం. కుటుంబ సభ్యులకు కూడా ఫుట్‌బాల్ మీద ప్రేమ ఉన్నది. తమ కుమారుడు మెస్సీ టాలెంట్ చూసిన జార్జ్ అతడిని లోకల్ క్లబ్స్‌లో జాయిన్ చేశాడు. నాలుగేళ్ల వయసులోనే మెస్సీని గ్రాండోలీ అనే క్లబ్‌లో చేర్చాడు. ప్రతీ రోజు మెస్సీని తల్లి సెలియా క్లబ్‌కు తీసుకొని వెళ్లి తీసుకొచ్చేది. అయితే మెస్సి చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో చాలా డిస్ట్రబ్ అయ్యాడు. ఆమె మరణ బాధ నుంచి కోలుకోవడానికి మరింత ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడాడు. గోల్ చేసిన ప్రతీసారి వేలిని ఆకాశం వైపు చూపిస్తూ సెలెబ్రేట్ చేసేవాడు. మెస్సీ టాలెంట్ చూసిన తండ్రి జార్జ్ అతడి 13 ఏళ్ల వయసులో బార్సిలోనాకు తీసుకొని వచ్చాడు. తన కొడుకును తమ క్లబ్‌లో చేర్చుకోమని బార్సిలోనా మేనేజ్‌మెంట్‌ను కోరాడు. ఎన్నో పరీక్షల తర్వాత బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ జూనియర్ అకాడమీలో మెస్సీ 2000లో జాయిన్ అయ్యాడు. 13 ఏళ్ల వయసులో తొలి సారిగా మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో అనుబంధం మొదలైంది. మూడేళ్లు గడిచేటప్పటికి బార్సిలోనా సీనియర్ టీమ్‌లో సభ్యుడిగా మారిపోయాడు. తన 17 ఏళ్ల వయసులో.. అంటే 2004లో తొలి సారి బార్సిలోనా తరపున బరిలోకి దిగాడు. అప్పటి నుంచి 17 ఏళ్ల పాటు బార్సిలోనా ఎఫ్‌సీ కీలక ఆటగాడిగా, కెప్టెన్‌గా లియోనల్ మెస్సీ ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. బార్సిలోనా జూనియర్, సీనియర్ జట్ల తరపున 778 మ్యాచ్‌లు ఆడిన మెస్సీ మొత్తం 672 గోల్స్ చేశాడు.

  మెస్సీ అంటే బార్సిలోనా.. బార్సిలోనా అంటే మెస్సీ అనే విధంగా ఫుట్‌బాల్ ప్రపంచంలో పేరున్నది. బార్సిలోనా తరపున 2004 అక్టోబర్16న బరిలోకి దిగిన మెస్సీ కాంట్రాక్ట్ ఎప్పటి కప్పుడు పొడిగించుకుంటూ వచ్చింది. అయితే ఈ ఏడాది జూన్ 30న మెస్సీ కాంట్రాక్టు పూర్తయ్యింది. కానీ బార్సిలోనా క్లబ్ అతడి కాంట్రాక్టును వెంటనే పునరుద్దరించలేదు. చివరి సారిగా 2017లో మెస్సీ ఒక్కో సీజన్‌కు 163 మిలియన్ డాలర్లు (రూ. 1200 కోట్లు) కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండు నెలల క్రితమే ఈ ఒప్పందం ముగిసిపోయినా క్లబ్ కొత్త కాంట్రాక్టును ఇవ్వలేదు. ఇటీవల స్పానిష్ ప్రభుత్వం ఫుట్‌బాల్ క్లబ్స్‌కు సంబంధించి కొత్త ఫైనాన్సియల్ రెగ్యులేషన్స్ అమలు చేస్తున్నది. అంతే కాకుండా బార్సిలోనా క్లబ్ ఆర్థిక సమస్యల కారణంగా మెస్సీకి భారీ మొత్తంలో వేతనం చెల్లించేందుకు సిద్దంగా లేదనే వార్తలు వచ్చాయి. మెస్సీ కూడా వేతనంలో భారీ పెరుగుదల లేకుండా కూడా ఒప్పందానికి రెడీ అయ్యాడు. కానీ కొత్త నిబంధనల వల్ల అతడికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో కాంట్రాక్టు కుదుర్చుకోలేదు. తన 21 ఏళ్ల బార్సిలోనా అనుబంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. మెస్సీ క్లబ్‌ను వీడి వెళ్తున్నట్లు బార్సిలోనా యాజమాన్యం కూడా స్పష్టం చేసింది. గతంలోనే తనను ఫ్రీగా క్లబ్ నుంచి విడుదల చేయమని అడిగినా యాజమాన్యం ఒప్పుకోలేదు.

  Khel Ratna: రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మారుస్తున్నట్లు ప్రకటించిన మోడీ.. కొత్త పేరు ఇదే
   బార్సిలోనా ఎఫ్‌సీ తరపున మెస్సీ ఇంత వరకు స్పానిష్ లీగ్స్‌లో 520 మ్యాచ్‌లు ఆడి 474 గోల్స్ చేశాడు. కోపా డీలో 80 మ్యాచ్‌లకు గాను 56 గోల్స్, చాంపియన్స్‌లీగ్‌లో 149 మ్యాచ్‌లకు గాను 120 గోల్స్.. ఇతర లీగ్స్‌లో 29 మ్యాచ్‌లకు గాను 22 గోల్స్ చేశాడు. ఇలా లీగ్స్‌లో మొత్తం 778 మ్యాచ్‌లు ఆడి 672 గోల్స్ సాధించాడు. మెస్సీ బార్సిలోనా టీమ్‌ను వీడుతున్నట్లు తెలియగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా బాధలో మునిగిపోయాడరు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మెస్సీ.. ఇక ఆడడు అని తెలిసి భావోద్వేగానికి గురవుతున్నారు.


  మరోవైపు మెస్సీతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి అనేక క్లబ్స్ ఆసక్తి చూపిస్తున్నాయి. గతంలో మాంచెస్టర్ సిటీ అతడి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పారీస్సెయింట్ జర్మైన్ (పీఎస్‌జీ) మెస్సీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరి ఏ క్లబ్ మెస్సీని కొంటాయో అని క్రీడా ప్రపంచం ఎదురు చూస్తున్నది.
  Published by:John Naveen Kora
  First published:

  Tags: Foot ball

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు